Share News

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్ అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటోన్న సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్ అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతలు అంటోన్న సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ పనుల కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

హస్తంతో దోస్తి..?

నిన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్ కలిసి ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపారు. మెట్రో పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చిన సందర్భంలో అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మజ్లిస్ భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని అసదుద్దీన్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

వెంటనే స్పందించిన సీఎం

సమస్య గురించి చెప్పగానే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంటనే స్పందించారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. యాకుత్ పురాలో 3 రోడ్ల విస్తరణ పనుల కోసం రూ.200 కోట్లు విడుదల చేశారని వివరించారు. మీరాలం వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారని ేర్కొన్నారు. ఇలా చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారని, రేవంత్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిలో కలిసి పనిచేస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

Updated Date - Mar 09 , 2024 | 12:07 PM