Share News

TS Politics: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:26 AM

బీఆర్ఎస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. లోక్ సభ బరిలో నిలిపే అభ్యర్థులు కరవయ్యారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత ఒక్కో నేత పార్టీని వీడుతున్నారు.

TS Politics: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి (BRS) వరసగా షాక్‌లు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో లోక్ సభ బరిలో నిలిపే అభ్యర్థులు కరవయ్యారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత ఒక్కో నేత పార్టీని వీడుతున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం (Loksabha Elections) స్వయంగా అధినేత కేసీఆర్ (KCR) రంగంలోకి దిగారు. చర్చలు, సమాలోచనలు జరిపి శ్రేణులకు ధైర్యం కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.

ఇది కూడా చదవండి: BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్

అభ్యర్థుల కరవు

రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థులు కనిపించడం లేదు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ పోటీ చేయడం లేదని ప్రకటించారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా నో అంటున్నారని తెలిసింది. మల్కాజిగిరిలో తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయరని మాజీమంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలిసింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలోకి వెళ్లారు. బీబీ పాటిల్‌కు బీజేపీ టికెట్ కూడా ప్రకటించింది. రాములు కుమారుడు భరత్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు.

సీఎం రేవంత్‌తో భేటీ

అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ నేతలు కారు దిగి కమలం లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దలపల్లి, మహబూబ్ నగర్, భువనగిరిలో లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటుంది. పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు ముందుకొచ్చారు. కానీ ఖర్చు మాత్రం పెట్టుకోవాలని కండీషన్ విధిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎదురుకాని సమస్యను ఎదుర్కొంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్

Updated Date - Mar 09 , 2024 | 11:09 AM