Share News

TG Politics: అబద్ధాల గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: రామచంద్రరావు

ABN , Publish Date - May 25 , 2024 | 05:02 PM

అబద్ధాల గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు (Ramachandra Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కోసం ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

TG Politics: అబద్ధాల గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: రామచంద్రరావు
Ramachandra Rao

ఖమ్మం జిల్లా: అబద్ధాల గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ (Congress party) తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు (Ramachandra Rao) అన్నారు. పట్టభద్రుల బీజేపీ (BJP) ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కోసం ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జాతీయవాద ఎన్నిక, జాతీయవాద వ్యతిరేఖ ఎన్నిక అని చెప్పారు. అనేక ఉద్యమాలు చూసిన జిల్లా కాబట్టి ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసునని అన్నారు.


రెండు రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నారన్నారు. బీజేపీ నాయకులు హైదరాబాద్‌ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నాయకులకు ఓటు వేయొద్దని తామే ఉన్నత విద్యావంతులమని . మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకుంటున్నారన్నారు.


బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే చేస్తుందన్నారు. ఈ రెండు పార్టీలు కూడా చట్టసభల్లో ప్రతిపక్షం ఉండకూడదని కుట్ర పన్నాయని ఆరోపించారు. ప్రేమేందర్ రెడ్డి 40 సంవత్సరాలు ఓకే సిద్ధాంతం మీద నిలబడి, ఓకే పార్టీలో ఉండి ప్రజల పక్షానా పోరాడుతున్నారని తెలిపారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసునని తెలిపారు. విద్యార్థులను, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.


కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలని కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ స్థాయి పెరుగుతోందని, అలా జరిగితే ప్రజల తరపున పోరాడుతుందనే భయంతో రెండు పార్టీలు కలిసి తమపై లేని పోని అబద్ధాలు చెబుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని రామచంద్రరావు కోరారు.


ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పాపం మొత్తం బీఆర్ఎస్‌దే: ధర్మారావు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పాపం మొత్తం బీఆర్ఎస్‌దేనని, పాప ప్రక్షాళన చేయాలంటే పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు (Dharma Rao) పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలు కాబట్టి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని, ఆయన పట్టభద్రుల తరుఫున పోరాడుతారని చెప్పారు. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసింది బీజేపీనేనని స్పష్టం చేశారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి పంపించాలని ధర్మారావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్

AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ

Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 05:11 PM