Share News

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

ABN , Publish Date - May 25 , 2024 | 02:17 PM

గన్నవరం మే 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, మరుసటి రోజు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా తాజాగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా.. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్‌గా మారింది.

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!
Vallabhaneni Vamsi

గన్నవరం మే 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, ఆ మరుసటి రోజు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా తాజాగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా.. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్‌గా మారింది.


గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా పని చేసే వారిని లక్ష్యంగా చేసుకుని ఆయన దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గంలో తనకు ఎదురువచ్చే వారిపై రౌడీయిజం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమ పార్టీ కాని వారిని నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో కూటమి కార్యకర్తలు, నేతలపై వైసీపీ మూకలను ఉసిగొల్పుతూ... తానూ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటపడింది.


గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఎన్నికల సమయంలో కూటమి తరఫున చురుకుగా వ్యవహరించారు. ఇది నచ్చని వంశీ మోహన్ తన అనుచరులు, వైసీపీ మూకలతో కలిసి బసవరావు ఇంటిపై దాడికి దిగారు. అయితే వంశీ మోహన్ ఆగడాలను స్థానిక టీడీపీ యువత అడ్డుకున్నారు. ‘నీ రౌడీయిజం ఇక్కడ కాదంటూ’ ఆయన్ను తరిమికొట్టారు. ఒక్కసారిగా గ్రామస్థులు, టీడీపీ యువకులు ఎదురుతిరగడంతో బెదిరిపోయిన వంశీ చేసేదేమీ లేక బసవరావు ఇంటి వెనక నుంచి పారిపోయారు.


మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన దాడులపై సీఈసీ సిట్ ఏర్పాటు చేయగా... విచారణ చేసిన సిట్ తమ రిపోర్టును డీజీపీకి అందజేసింది. దాడులకు బాధ్యులను చేస్తూ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెండ్ చేసిన విషయమూ విధితమే. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6వరకు అరెస్టు చేయెుద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పెదవి విరుస్తున్నారు. వైకాపా నాయకులను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే వంశీ మోహన్ సైతం దాడులకు తెగబడుతున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలే..

Updated Date - May 25 , 2024 | 02:43 PM