Share News

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

ABN , Publish Date - May 25 , 2024 | 11:17 AM

ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు..

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ (AP Elections 2024) రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు. పోలింగ్ బూత్‌ల వద్ద రచ్చ చేసి, ఓటర్లతో పాటు అధికారుల దృష్టి మళ్లించి, రిగ్గింగ్ చేయాలని ట్రై చేశారు. ఈ క్రమంలోనే ఓ పోలింగ్ బూత్ ఏజెంట్‌పై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. రిగ్గింగ్ చేయబోయిన తమను అడ్డుకున్నందుకు.. కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు కూడా! దీంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) రంగంలోకి దిగి, ఆ ఏజెంట్‌కి అండగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


Read Also: మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..

మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, కండ్లగుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యాలరావు ఎన్నికల రోజున 114వ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నారు. ఆరోజు రిగ్గింగ్ కోసం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి బూత్‌లోకి వెళ్లారు. అప్పుడు మాణిక్యాలరావు ఆయన్ను అడ్డుకోబోయారు. ఇది చట్టవిరుద్ధమని, రిగ్గింగ్ జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని తెగేసి చెప్పారు. దీంతో.. వెంకట్రామిరెడ్డి హంగామా సృష్టించారు. తొలుత తన అనుచరుల్ని తీసుకొని.. మాణిక్యాలరావు ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి.. ఈ విషయాన్ని మాణిక్యాలరావుకి చెప్పారు. అంతేకాదు.. నిన్ను కూడా చంపేస్తామని బెదిరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన మాణిక్యాలరావు.. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు.

Read Also: విషాదాంతంగా మారిన వరంగల్ ‘లవ్ స్టోరీ’.. అసలు ఏమైందంటే?

మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు దృష్టికి చేరింది. వెంకట్రామిరెడ్డి పాల్పడిన ఈ అరాచకం గురించి తెలిసి, మాణిక్యాల రావుకి అండగా నిలిచారు. ఆయనకు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. మీకేం కాదని, ధైర్యంగా ఉండాలని, ఏం జరగకుండా తాము చూసుకుంటామని ధైర్యం చెప్పారు. వైసీపీ అల్లరి మూకకు భయపడాల్సిన అవసరం లేదని, ఎంతో ధైర్యంగా రిగ్గింగ్ జరగకుండా చూసుకున్నారని మాణిక్యాలరావుని ప్రశంసించినట్లు తెలిసింది. అటు.. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 11:17 AM