Share News

YSRCP: మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..

ABN , Publish Date - May 25 , 2024 | 10:31 AM

ఏపీలో అధికార వైసీపీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకొని.. వైసీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ రోజున..

YSRCP: మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..

ఏపీలో అధికార వైసీపీ (YSRCP) అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టీడీపీ (TDP) నాయకులను టార్గెట్ చేసుకొని.. వైసీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (AP Elections 2024) రోజున వైసీపీ మూకలు ఎలా రెచ్చిపోయాయో అందరికీ తెలుసు. ప్రశాంతంగా సాగాల్సిన పోలింగ్‌ని కొన్ని చోట్ల రసాభసాగా మార్చేశారు. కొందరిపై ఎటాక్ చేసి.. గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నిర్వాకం గురించి అందరికీ తెలిసిందే. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇప్పటికీ వైసీపీ మూకల దాడులు ఆగడం లేదు.


Read Also: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

తాజాగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో టీడీపీ నాయకుడు చిగురుపాటి గిరి కారుపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. మూడు బాటిళ్లలో పెట్రోల్ తీసుకొచ్చి, ఆ కారుని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కచ్ఛితంగా వైసీపీ మూక చేసిన పనే అని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమధ్య వైసీపీ మూకలు తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని.. చిరుగుపాటి కారుని దగ్ధం చేయడం వెనుక కూడా ఆ పార్టీ పనేనని టీడీపీ వర్గీయులు పేర్కొంటున్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 10:31 AM