Share News

Maha Shivratri: హర హర మహాదేవ్... తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:02 AM

Telangana: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు.

Maha Shivratri: హర హర మహాదేవ్... తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

హైదరాబాద్/అమరావతి, మార్చి 8: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి (Mahashivratri Celebrations) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, వేయిస్తంభాల గుడి, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, పంచరామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు భక్త జనసంద్రంగా మారాయి.

Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?


తెలంగాణ:

రాజన్న సిరిసిల్ల: వేమువాడ రాజన్న అలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు. శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. నల్గొండలోని పురాతన ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సూర్యాపేట పిల్లలమర్రి, మేళ్ల చెర్వు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చెర్వు గట్టు పార్వతీజడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి ఆగస్తేశ్వర స్వామి దేవాలయాలల్లో భక్తులు పూజలు నిర్వహించారు.

వరంగల్: జిల్లాలోని ఆలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సౌకర్యాలు చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, కాజీపేట మడికొండలోని మెట్టుగుట్ట, వరంగల్లోని భద్రకాళి ఆలయం, కాశీబుగ్గలోని కాశీ విశ్వేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది.

ములుగు జిల్లా: వెంకటాపూర్ మండలం రామప్పలోని రామలింగేశ్వర క్షేత్రం, మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రుడి సన్నిధి, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని త్రివేణి సంగమ తీరం, కాళేశ్వర ముక్తీశ్వర సన్నిధానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మణుగూరులో తెల్లవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి పరమశివుడిని దర్శించుకుంటున్నారు. నీలకంఠ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేటి రాత్రి రంగ రంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం జరుగనుంది. బూర్గంపాడు మండలం మోతె గడ్డ వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా కోటి లింగాల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శివ లింగానికి భక్తులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కొమురం భీం జిల్లా: సిర్పూర్ నియోజక వర్గంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇస్ గాం శివమల్లన్న స్వామి ఆలయంలో భక్తులతో కిక్కిరిసి పోయింది.

mahashivratri.jpg

YSRCP: ఒక ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్.. సడన్‌గా ఇలా జరగడంతో..!?


ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బాసర, బ్రహ్మపురి, సోన్, ఖానాపూర్, కలమడుగు, మంచిర్యాల, చెన్నూరు గోదావరి తీరాల్లో వేలాది మంది భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

సిద్దిపేట జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు... మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

సంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివస్తున్నారు.

మంచిర్యాల: మహాశివరాత్రి సందర్భంగా వేలాల గట్టు మల్లన్న, కత్తరశాల మల్లి ఖార్జున స్వామి ఆలయాల్లో మహా శివరాత్రి జాతర జరుగుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

vemulavada.jpg

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!


ఆంధ్రప్రదేశ్

నంద్యాల: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసి పోగా.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నందివాహనంపై భక్తులకు స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ప్రభొత్సవం నిర్వహించనున్నారు. రాత్రి పదిగంటలకు ఆలయంలో నవనందుల పాగాళంకరణ అనంతరం స్వామిఅమ్మవార్ల కళ్యాణాన్ని దేవస్థానం నిర్వహించనుంది.

పగో: పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్‌లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆచంటలో శివరాత్రి పురస్కరించుకుని రామేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవిశంకర్ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భీమవరం పంచారామ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తాకగ. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాకగ. ఏలూరులోని పోలవరం మండలం పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. నదిలో మధ్యలో ఆలయానికి భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవలతో రహదారి ఏర్పాటు చేశారు.

తూ. గో .జిల్లా: కొవ్వూరు గోష్పాద క్షేత్రం గోదావరి నది వద్ద భక్తులు పోటెత్తారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.

srisailam-shivaratri.jpg

కేంద్ర ఉద్యోగులకు 4% డీఏ


అమరావతి: మహాశివరాత్రి సందర్భంగా పలు శైవక్షేత్రాలు శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. యనమలకుదురు శివాలయంలో తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రామంలోకి ద్విచక్ర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, వన్ టౌన్ పాత శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విశాఖపట్నం: మహా శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి.

పల్నాడు: జిల్లా వ్యాప్తంగా శివ క్షేత్రాలలో మహా శివరాత్రి సందడి నెలకొంది. పంచరామ క్షేత్రం అమరావతి, కోటప్పకొండ త్రికోటేశ్వరుని, చేజర్ల కపోతేశ్వర స్వామి , దైదా, సత్రశాల దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బ్రాహ్మణి ముహూర్తంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు.

ఏలూరు జిల్లా కైకలూరు: మహాశివరాత్రి సందర్భంగా కలిదిండి పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయ సమీపంలో ఉన్న పంచభూగ్గల కోనేరులో స్నానాలు ఆచరించి భక్తులు పితృ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాటు చేశారు.

కర్నూలు: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ లోని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాల్వబుగ్గ ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది.

ఇవి కూడా చదవండి...

YSRCP: అయ్యారే.. జగన్‌తో మహాత్ముడి ముచ్చటా?

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 10:18 AM