Share News

Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:16 AM

మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నామని, దీంతో లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని పేర్కొంది. వంటగ్యాస్ ధర తగ్గించడంతో మహిళలకు అండగా నిలిచినట్టు అవుతుందని వెల్లడించింది.

Womens Day: మహిళలకు ప్రధాని మోదీ  కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

ఢిల్లీ: మహిళా దినోత్సవం (Womens Day) రోజున కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ (LPG Cylinder) ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నామని, దీంతో లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని పేర్కొంది. వంటగ్యాస్ ధర తగ్గించడంతో మహిళలకు (Womens) అండగా నిలిచినట్టు అవుతుందని వెల్లడించింది. మహిళా సాధికారత కల్పించేందుకు సిలిండర్ ధర తగ్గింపు దోహద పడుతోందని పేర్కొంది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 955గా ఉంది. రూ.100 తగ్గడంతో రూ.855కి చేరుతుంది.

మోదీ గిఫ్ట్

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ‘నారీ శక్తి బలం, ధైర్యానికి సెల్యూట్. వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నారు. విద్య, వ్యవసాయం, సాంకేతికతలో మహిళా సాధికరత కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో మహిళల కోసం చేపట్టిన పనులను ప్రతిబింబిస్తోంది అని’ ట్వీట్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారు.

వారికి రూ.300 సబ్సిడీ

పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు తీపి కబురు చెప్పింది. ఉజ్వల యోజన కింద ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేద మహిళల సిలిండర్లపై రూ.300 సబ్సిడీ అందజేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజు సిలిండర్ ధరపై రూ.100 తగ్గిస్తున్నామని ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రెండు రోజుల్లో డబుల్ బొనాంజా ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 09:56 AM