Share News

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!

ABN , Publish Date - Mar 07 , 2024 | 08:03 PM

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్‌గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది..

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!
Kodali Nani

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్‌గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ నాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయమేంటి..? ఎందుకీ ప్రకటన అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. అల్లు అర్జున్ మామకు స్వీట్ న్యూస్!


Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!



kodali nani.jpg

BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!

అసలేం జరిగింది..?

కొడాలి నాని రాజకీయాలకు (Politics) గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించారు. 2024లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ స్వయంగా ఆయనే ప్రకటించారు. ‘నాకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు. 2029 ఎన్నికల్లో పోటీచేయను. నా కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. రోడ్లకు పర్మినెంట్‌గా స్ట్రక్చర్ వేయాలి. రూ. 500 నుంచి 600 కోట్ల వరకూ ఖర్చయ్యే పనులు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నరమెంట్ వస్తే నాకు మంత్రి పదవి అస్సలు అక్కర్లేదు. ఐదారు వందల కోట్లు.. రోడ్లు, కాలువలు, వాల్స్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు డబ్బులిస్తే చాలు. దీంతో గుడివాడ అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ అయ్యాక నేను గుడివాడ నుంచి పోటీ కూడా చేయను. ఎవరికో ఒకరికి సీటిచ్చుకోనివ్వండి. వయసు అయిపోతోంది. నాకు ఇప్పుడు 52 ఏళ్లు. ఇంకో టెర్మ్‌కు నాకు రిటైర్మెంట్ వయస్సు వస్తుంది. ఎవరో ఒకరు కొత్త కుర్రాళ్లకు ఇస్తే మళ్లీ ఐదు సంవత్సరాలు గెలిచి కొట్టుకుంటారు. నా కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. రాజకీయాల్లోకి నా తమ్ముడి కొడుకు వస్తాడేమో..?’ అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. నాని చేసిన ఈ సంచలన ప్రకటనతో వైసీపీ హైకమాండ్ కంగుతిన్నదట. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్‌లో దీనిపై పెద్ద చర్చే నడుస్తోందట.

venigandla-nani.jpg

AP Politics: ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. అందరి చూపు ఇటే..!

ఇన్‌సైడ్ టాక్ ఇదీ..!

వాస్తవానికి 2024 ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ నుంచి గట్టిపోటీనే ఉంది. అసలు ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీచేస్తారో లేదో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. మొన్నటి వరకూ మండల హన్మంతరావు బరిలోకి దిగబోతున్నారంటూ వార్తలు రావడం ఆ తర్వాత.. అబ్బే అదేమీ లేదని మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేగా.. మంత్రిగా గెలిచిన నాని నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నది గుడివాడలో జరుగుతున్న చర్చ. అభివృద్ధేమీ లేకపోవడంతో నానిపై గట్టిగానే వ్యతిరేకత ఉందని టాక్. దీంతో అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా వైసీపీ ఆచితూచి అడుగులేస్తోంది. మరోవైపు.. ఇవే చివరి ఎన్నికలని చెబితే ఈసారైనా టికెట్ ఇస్తారేమోనని కూడా ఇలా నాని చెప్పి ఉండొచ్చన్నది కూడా ఓ ఆరోపణ. మరోవైపు.. నాని ప్రత్యర్థి.. టీడీపీ తరఫున పోటీచేస్తున్న వెనిగండ్ల రామును బలమైన వ్యక్తి కావడంతో భయపడి.. జనాల్లో సింపతీ కోసమే ఇలా మాట్లాడుతున్నారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇందులో ఏది నిజమో.. ఇంకేది అబద్ధమో నానీకే తెలియాలి మరి.

Kodali-And-Jagan.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Chandrababu: వైసీపీ వలంటీర్లకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

Updated Date - Mar 08 , 2024 | 09:22 AM