Share News

KTR: సీఎం గారు.. రైతులంటే ఎందుకింత చిన్నచూపు?

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:21 AM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూరు తిరగడమే తప్ప.. అన్నదాతల ఆర్థనాదాలు వినబడవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు వినే ఓపిక లేదా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు.

KTR: సీఎం గారు.. రైతులంటే ఎందుకింత చిన్నచూపు?

హైదరాబాద్, మార్చి 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూరు తిరగడమే తప్ప.. అన్నదాతల ఆర్థనాదాలు వినబడవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు వినే ఓపిక లేదా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు.

కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘‘ముఖ్యమంత్రి గారు..

రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?

నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..

నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..

గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...?

అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?

ఎన్నికల గోల తప్ప..

ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?

సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప..

అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?

ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?

పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??

పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ..

రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?

ఇంతకాలం..

పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!

ఇప్పుడు..

నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Crime.. హైదరాబాద్‌లో రూ. 25 లక్షల నగదు సీజ్ చేసిన పోలీసులు

Andhra Pradesh: ప్రాజెక్టులపై పగ.. జగన్ మాటలు, చేతలన్నీ మోసపూరితమే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 11:33 AM