Share News

Crime.. హైదరాబాద్: రూ. 25 లక్షల నగదు సీజ్ చేసిన పోలీసులు

ABN , Publish Date - Mar 20 , 2024 | 09:05 AM

హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్బంగా సుల్తాన్ బజార్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాచిగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు.. టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనుఫ్ సోనీ అనే వ్యక్తి వద్ద రూ. 25 లక్షల నగదు లభ్యమైంది.

Crime.. హైదరాబాద్: రూ. 25 లక్షల నగదు సీజ్ చేసిన పోలీసులు

Crime..: ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్న సందర్బంగా సుల్తాన్ బజార్ పోలీసులు (Police) తనిఖీలు చేపట్టారు. కాచిగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు.. టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనుఫ్ సోనీ అనే వ్యక్తి వద్ద రూ. 25 లక్షల (25 lakhs) నగదు లభ్యమైంది. దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు నగదును సిజ్ చేసి.. ఐటీ అధికారులకు సమాచారం అందించారు.

మరోవైపు హైదరాబాద్ మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాం గల్లీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 150 మంది పోలీసులు 10 టీమ్‌లుగా ఫామ్ చేసి కట్ ఆఫ్ పార్టీలు పెట్టుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలతో పాటు 17 అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఇళ్లలో దాదాపు 24 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రజలలో సురక్షిత భావం కల్పించేందుకు అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్ల దృష్ట్యా ఈ సర్చ్ నిర్వహించినట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే 14 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Updated Date - Mar 20 , 2024 | 09:10 AM