Share News

Adluri Laxman Kumar: రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు.. హరీష్‎రావుపై అడ్లూరి లక్ష్మణ్ ధ్వజం

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:35 PM

రైతుల భూములను కేసీఆర్, హరీష్‎రావు‎లు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్​, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్‎రావు‎తో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్‎రావు‎ టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు

Adluri Laxman Kumar: రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు..  హరీష్‎రావుపై అడ్లూరి లక్ష్మణ్ ధ్వజం
Adluri Laxman Kumar

హైదరాబాద్: రైతుల కడుపు కొట్టి రెండు పంటలు పండే భూములను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‎రావు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్​, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేశారు. రైతుల పొట్టకొట్టిన ఆ నాటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శించారు. మల్లన్న సాగర్ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్‎ల మధ్య గ్రామసభలు పెట్టారని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‎లో అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా బీఆర్ఎస్‎పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల భూములను కేసీఆర్, హరీష్‎రావు‎లు బలవంతంగా లాక్కున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్‎రావు‎తో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్‎రావు‎ టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మల్లన్నసాగర్‎పైన చర్చించడానికి కేసీఆర్‎ను హరీష్‎రావు‎ తీసుకువస్తే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ ఎప్పుడు వస్తారో  డేట్, టైం చెబితే తమ సీఎం రేవంత్ రెడ్డి వస్తారని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, చొప్పదండి, ధర్మపురి.. ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.


ధర్మపురిలో కాళేశ్వరం లింక్ 2 నిర్వాసితుల సమస్యలపైన హరీష్‎రావు‎తో చర్చకు తాను సిద్ధమని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. హరీష్‎రావు‎ పదే పదే అబద్దాలు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. భూనిర్వాసితుల పాపం వట్టిగా పోదని ఆక్షేపించారు.  మలన్న సాగర్‎లో కేసీఆర్, హరీష్‎రావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పరిహారం అడిగిన రైతుల, నాయకులపైన కేసులు పెట్టారని అన్నారు.


ఆ నాటి ప్రభుత్వ అరాచకాల కారణంగా  మల్లన్న సాగర్‎లో మల్లారెడ్డి అనే రైతు తన సొంత ఇంట్లో ఆత్మాహుతి చేసుకున్నారని అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. లోక్‎సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో అందరికీ తెలుసునని అన్నారు. పోలింగ్ జరుగుతుండగానే బీఆర్ఎస్ అస్త్రసన్యాసం చేసిందని అడ్లూరి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 03:38 PM