Share News

Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:19 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్రంలో పదేళ్లు అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ అలుపెరుగని పోరాటంతో, అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అమర వీరులకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని విమర్శించారు.


Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వడ్లు కొనేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను చూసే ప్రజలు ఓట్లు వేశారని బీజేపీని చూసి కాదని రఘు నందన్ రావుచేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.

Elections 2024: సైకో ప్రభుత్వాన్ని తరిమితేనే రాష్ట్రానికి మంచి రోజులు.. బాలకృష్ణ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 08:19 PM