Share News

Pawan Kalyan: జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:15 PM

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. దీంతో యూట్యూబ్ ఛానెల్ సరి చేసేందుకు నిపుణులను ఆగ మేఘాల మీద రంగంలోకి దింపారు. అయితే ఈ చానెల్‌ను విదేశాల్లో హ్యాక్ చేసినట్లు వారు గుర్తించారు.

Pawan Kalyan: జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్
Pawan Kalyan

అమరావతి, ఏప్రిల్ 13: జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. దీంతో యూట్యూబ్ ఛానెల్ సరి చేసేందుకు నిపుణులను ఆగ మేఘాల మీద రంగంలోకి దింపారు. అయితే ఈ చానెల్‌ను విదేశాల్లో హ్యాక్ చేసినట్లు వారు గుర్తించారు. సాంకేతికపరమైన సెట్టింగ్‌లను నిపుణుల బృందం మారుస్తుంది. మళ్లీ యాధావిధిగా యూట్యూబ్ చానెల్ ప్రసారమయ్యేలా నిపుణులు చర్యలు చేపట్టారు. అయితే కావాలని కుట్రతోనే పార్టీ యూట్యూబ్ చానెల్‌ హ్యాక్ చేశారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే అధికార జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఓ ప్రచారం అయితే వైరల్ అవుతోంది. అదీకాక ఆ పార్టీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కట్టారు.. కడుతోన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వరుసగా అధికారాన్ని దక్కించుకొనేందుకు వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు నల్లేరు మీద నడకేనని ఇప్పటికే పలు సర్వేలు సుస్పష్టం చేశాయి.

Samosa: సమోసాలో చచ్చిన చీమలు.. వీడియో వైరల్


అదీకాక రాష్ట్రంలోని అన్నీ పార్టీల అధినేతలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులోభాగంగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Nara Bhuvaneswari: టాప్‌లో ట్రెండ్ అవుతున్న నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్

అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిందంటే.. అందుకు యూట్యూబ్‌లో ప్రసారమైన రాజకీయ పార్టీల యాడ్‌లే అందుకు కారణమని ఓ చర్చ అయితే ఇప్పటికే జనసామాన్యంలో నలుగుతోంది. అలాంటిది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ కావడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికార పార్టీ కుట్రేనని వారు ఆరోపణలు సంధిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 08:15 PM