Share News

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా

ABN , Publish Date - Apr 13 , 2024 | 06:44 PM

కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా
Tejashwi Prasad Yadav

పాట్నా, ఏప్రిల్ 13: కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (Indian National Developmental Inclusive Alliance) (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ (Rashtriya Janata Dal ) నాయకుడు తేజస్వీ యాదవ్ ( Tejashwi Prasad Yadav) ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ మేనిఫెస్టోను తేజస్వీ యాదవ్ విడుదల చేశారు.

Samosa: సమోసాలో చచ్చిన చీమలు.. వీడియో వైరల్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 24 అంశాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఆగస్ట్ 15 తర్వాత ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయని చెప్పారు. ఇది మేనిఫెస్టో ఆర్జేడీదా? లేకుంటే ఇండియా కూటమిదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఇది పరివర్తన్ పత్రమని అభివర్ణించారు.


అయితే కాంగ్రెస్ పార్టీ 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే కోటి ఉద్యోగాలను రైల్వేల్లో, సాయుధ దళాలతోపాటు ఇతర ప్రభుత్వ రంగాల్లో నియమిస్తామని స్పష్టం చేశారు.

S Jaishankar: ఉగ్రవాదులకు వాళ్ల భాషలోనే సమాధానం ఇవ్వాలి: జైశంకర్

2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిందని.. అందులో ఆర్జేడీ.. పార్టీ రెండో అతి భాగస్వామ్య పార్టీ అని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇఫ్పటికే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. మరో 70 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.


ఇక నిరుపేద కుటుంబాల్లోని సామాన్య మహిళలకు రూ. లక్ష అందిస్తామన్నారు. మహిళాసాధికారత కోసం దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామన్నారు. మరోవైపు రాఖీ పండగ పురస్కరించుకొని సోదరిమణులుకు రూ.లక్ష అందిస్తామన్నారు. ఇక బిహార్ ప్రత్యేక హోదా కోసం రూ. 1.60 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఈ ప్యాకేజీ అని స్పష్టత ఇచ్చారు.

SAVE ABDUL RAHIM: రహీమ్ కోసం రంగంలోకి సీఎం

ఇక బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. ఒక్కొక్క స్థానానికి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బిహార్‌లో పర్యాటకాభివృద్ధి కోసం 5 ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 06:47 PM