Share News

Samosa: సమోసాలో చచ్చిన చీమలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:23 PM

తింటున్న సమోసాలో చచ్చిన చీమలు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించి.. ఆ సమోసాను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే సదరు వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. 2 మిలియన్ల మందికిపైగా ఆ వీడియోను వీక్షించారు.

Samosa: సమోసాలో చచ్చిన చీమలు.. వీడియో వైరల్

న్యూడిల్లీ, ఏప్రిల్ 12: తింటున్న సమోసాలో చచ్చిన చీమలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఆ సమోసాను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే సదరు వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

రెండు మిలియన్లకు పైగా ఈ వీడియోను వీక్షించారు. డిల్లీ యూనివర్శిటీకి చెందిన దయాళ్ సింగ్ కాలేజీ క్యాంటీన్‌లో సమోసాలు విక్రయించారు. ఆ సమోసాలో చనిపోయిన చీమలు ఉన్నాయని విద్యార్థులు గుర్తించారు. ఆ సమోసాను వీడియో తీసి.. పోస్ట్ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ మొదట్లో చోటు చేసుకుంది.

అయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ క్యాంటీన్లలో ఆహారాన్ని కోనుగోలు చేయవద్దని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తోందని అంటున్నారు.

Kolkata: అప్పటి కంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం.. లోక్‌సభ ఎన్నికలపై చిదంబర జోస్యం

కాలేజీ క్యాంటీన్లలో కల్తీ ఆహారం ఉంటుందని జాగ్రత్తలు చెబుతున్నారు. నా స్నేహితురాలు దయాళ్ క్యాంటీన్‌లో సమోసా కొనుక్కుంది. ఆ సమోసాలో చీమలు ఉన్నాయి. దానిని వీడియో తీసి పోస్ట్ చేశానని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విద్యార్థి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

ఈ వీడియోకు వ్యంగ్య కామెంట్స్ సైతం వస్తున్నాయి. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా పోట్రిన్ కలుస్తోందని పేర్కొంటున్నారు. ప్రోటిన్ డైట్, ఎక్స్ ట్రా క్రంచ్ అంటూ పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇటీవల మహారాష్ట్రలోని పుణే నగరంలో విక్రయించిన సమోసాలో కండోమ్, రాళ్లు, సిగరేట్ పీకలు ఉండాన్ని గుర్తించారు. ఈ వార్త కలకలం సృష్టించింది. ఆ క్రమంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అందుకు సంబంధం ఉన్న అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/C5XhueiRnLS/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 05:34 PM