Share News

Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

ABN , Publish Date - Apr 13 , 2024 | 06:35 PM

టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ ( TDP ) లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు.

Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ ( TDP ) లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోహైటెక్ సిటీ నిర్మించి ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి 27రకాల సేవలు అందిస్తున్నారన్న అనురాధ మోడల్ స్కూలు నడుపుతూ 6వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారని కొనియాడారు. తమ అభిమాన నేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుండెపోటుతో చనిపోవడం చూసి భువనేశ్వరి కలత చెందారని భావోద్వేగానికి గురయ్యారు.


Andhra Pradesh: ఈదురు గాలుల బీభత్సం.. విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం..

కార్యకర్తల మరణాలు తెలుసుకున్న చంద్రబాబు ఆదేశాల మేరకు భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 9,080 కిలోమీటర్లు ప్రయాణం చేసి 95అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి కుటుంబ సభ్యులు సైతం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.

- పంచుమర్తి అనురాధ, టీడీపీ లీడర్


Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..

రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించుకుంటామని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కంపెనీలు లేక యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరువూరు నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేయలేదన్నారు. రాష్ట్రంలో నిజం గెలవాలంటే తెలుగు దేశం గెలవాలని చెప్పారు. జగన్ అంటే అబద్దం చంద్రబాబు అంటే నిజం అని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 06:35 PM