Share News

Andhra Pradesh: ఈదురు గాలుల బీభత్సం.. విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం..

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:06 PM

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి.

Andhra Pradesh: ఈదురు గాలుల బీభత్సం.. విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం..

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి. జల్లులతో పాటు నగరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మరికొద్ది సమయంలో సీఎం జగన్ బస్సు యాత్రగా వస్తున్న తరుణంలో నగరంలో ఈదురు గాలులతో పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఎగిరిపోయాయి. నగంలోని గోతులమయంగా మారిన రోడ్లలో నీరు నిలిచింది. దీంతో గమ్య స్థానాలకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..

నిన్నా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొట్టాయి. ఓవైపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు మోసుకొచ్చింది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించింది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.


Hyderabad: రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్.. పట్టపగలు అందరూ చూస్తుండగానే..

మరోవైపు తెలంగాణలోనూ ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 05:06 PM