Share News

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:53 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తాజాగా ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ప్యాంటుకు బదులు షార్ట్స్ వేసుకున్న యువకుడిని సెక్యూరిటీ గార్డు బ్యాంకులోకి అనుమతించని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తాజాగా ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ప్యాంటుకు బదులు షార్ట్స్ ( 3/4 ) వేసుకున్న యువకుడిని సెక్యూరిటీ గార్డు బ్యాంకులోకి అనుమతించని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఇలాంటి అనుభవం తనకు ఎక్కడా ఎదురు కాలేదంటూ ఆ కస్టమర్ షాకైపోయాడు. అయితే, సెక్యూరిటీ గార్డు తీరును అతడు కెమెరాతో రికార్డు చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ వీడియోపై పెద్ద చర్చ జరుగుతోంది.

Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి 3/4 వేసుకుని బ్యాంకుకు వెళ్లాడు. కానీ సెక్యూరిటీ గార్డు మాత్రం అతడిని బ్యాంకులోకి కాలుపెట్టనివ్వలేదు. ఫుల్ ప్యాంటు వేసుకుంటేనే బ్యాంకులోకి అనుమతిస్తానని తేల్చి చెప్పాడు. తలుపునకు అడ్డంగా చేయిపెట్టి నిలబడిపోయాడు. దీంతో, దిమ్మెరపోవడం కస్టమర్ వంతైంది. ఆ తరువాత కస్టమర్ సెక్యూరిటీ గార్డును వరుస ప్రశ్నలతో నిలదీశాడు. బ్యాంకు కస్టమర్లకు డ్రెస్ కోడ్ పెట్టారా? అని అడిగాడు. డ్రెస్ కోడ్ ఉంటే వాటి తాలూకు నిబంధనలు బ్యాంకు ముందు బోర్డుపై ఎందుకు రాసిపెట్టలేదని సూటి ప్రశ్న వేశాడు. కానీ అతడి ప్రశ్నలకు సెక్యూరిటీ గార్డు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. పద్ధతిగా వస్తేనే లోపలికి అనుమతని వాదించాడు (Man Denied Entry In Bank For Wearing Shorts).

Viral: అకస్మాత్తుగా కారు సైరెన్లు మోగడంతో పోలీసులకు షాక్.. ఏం జరిగిందని ఆరా తీస్తే..


ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు సెక్యూరిటీ గార్డు తీరుపై మండిపడుతున్నారు. బ్యాంకులో పద్ధతిగా ఉండాలన్న నియమం ఉన్నప్పటికీ ఇలా షార్ట్స్ వేసుకోవడంపై కూడా నిషేధం ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం సెక్యూరిటీ గార్డు చేతివేళ్లకున్న ఉంగరాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇతడేమైనా లక్షల్లో సంపాదిస్తున్నాడా? అని ప్రశ్నించారు. కొందరు మాత్రం తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైయ్యాయని చెప్పుకొచ్చారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 04:59 PM