Share News

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:28 PM

గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

గురుగ్రామ్: గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నిందితుడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్న తరుణంలో సినీ స్టార్ సోనూ సూద్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. డెలివరీ బాయ్‌కి మద్దతు తెలుపుతూ సోనూ ఓ పోస్ట్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవద్దని అధికారులను కోరారు.

"స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు.. షూలు దొంగిలించినట్లయితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతనికి కొత్త షూలు కొనండి. నిజంగా అతనికి అవి అత్యవసరం కావచ్చు.. అతనిపట్ల కాస్త దయగా ఉండండి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సోనూ సూద్‌ను సమర్థిస్తుండగా.. మరికొందరు మండిపడుతున్నారు.


నెటిజన్ల స్పందన

సోనూ సూద్ అభిమానులు ఆయన పోస్ట్‌ని అభినందిస్తున్నారు. అయితే ఆ పోస్ట్ నచ్చని మరికొందరు నిందితుడిపై చర్యలు తీసుకోకూడదని.. చెప్పడం ఫర్వాలేదు కానీ.. అర్థం లేని వ్యాఖ్యలతో దొంగను సమర్థించడమేంటీ అని ప్రశ్నిస్తున్నారు. పేదరికం, అవసరం దొంగతనానికి ప్రేరేపించదు. అలాగైతే లక్షల సంఖ్యలో ఉన్న ప్రజలు, డెలివరీ బాయ్‌లు దొంగతనాలు చేసి బతికేవారని.. కానీ వారు అలా చేయట్లేదని అంటున్నారు. వారంతా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదిస్తున్నారని అని కౌంటర్ ఇస్తున్నారు.

Delhi: ప్రధాని మోదీ ఆడిన ఈ గేమ్ ఏంటో మీకు తెలుసా..

''ఒక చైన్ స్నాచర్ మీ బంగారు గొలుసును లాక్కుంటే, అతనిపై చర్యలు తీసుకోకండి. అతడికి కొత్త బంగారు గొలుసు కొనండి. అతడికి నిజంగా అవసరం కావచ్చు. దయగా ఉండు'' అని మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆ దొంగ నిత్యం ఇవే పనులు చేస్తుంటే ఏం చేయాలో చెప్పాలని సోన్ సూద్‌ని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. ఇలా నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో సోనూ సూద్ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టి దేశ వ్యాప్తంగా రియల్ హీరో అనిపించుకున్నారు. అలాంటి వ్యక్తి నుంచి దొంగతనం చేసిన వ్యక్తిపై ఇలాంటి సానుభూతి వస్తుందని అనుకోలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 04:40 PM