Share News

CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:53 PM

Telangana: రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.

CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్, మార్చి 4: రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి (PM Narendra Modi) కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సోమవారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఎన్‌టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం


అంతకుముందుకు.. జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు రూ.6వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. అండర్‌ డ్రైనేజ్‌ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌- బేల- మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు.

ఇవి కూడా చదవండి...

BJP: కమలం పార్టీలో చిచ్చురేపిన మొదటి లిస్టు...

TG Bharath: టీడీపీ సూపర్‌ సిక్స్‌తో పాటు టీజీ భరత్ ఆరు గ్యారెంటీలు..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2024 | 01:10 PM