Share News

BJP: కమలం పార్టీలో చిచ్చురేపిన మొదటి లిస్టు...

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:45 PM

హైదరాబాద్: కమలం పార్టీలో మొదటి లిస్టు చిచ్చు రేపింది. బీజేపీలో లోక్ సభ టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. పలువురు నేతలు గీత దాటుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న పార్టీలో ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.

BJP: కమలం పార్టీలో చిచ్చురేపిన  మొదటి లిస్టు...

హైదరాబాద్: కమలం పార్టీ (Kamalam Party)లో మొదటి లిస్టు (First list) చిచ్చు రేపింది. బీజేపీలో లోక్ సభ (Lok Sabha) టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పలువురు నేతలు గీత దాటుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న పార్టీలో ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం మాజీ మంత్రి ఈటల రాజందర్‌ (Etala Rajander)కు కేటాయించడంతో సీనియర్ నేత మురళీధరరావు (Muralidhara Rao) తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. స్థానిక నేతలు కూడా ఈటలకు సీటు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్ టికెట్ మాధవి లతకు కేటాయించడాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కిషన్ రెడ్డి (Kishan Reddy)కి హైదరాబాద్‌లో పోటీ చేసే మగాడే దొరకలేదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మహబూబ్‌నగర్ టికెట్ విషయంలో ఇద్దరు కీలక నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఈ టికెట్‌ను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jitender Reddy)ఆశిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) కూడా పాలమూరు సీటు కోసం పట్టుపడుతున్నారు. మరోవూపు జహిరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పాటిల్‌కు ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక నాగర్ కర్నూల్ టికెట్ దక్కగపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న బంగారు శృతి (Bangaru Shruthi).. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. అయితే ఆమె కాంగ్రెస్‌ (Congress)లో చేరుతారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - Mar 04 , 2024 | 12:48 PM