Share News

Viral Video: రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి చుట్టేసిన పొగమంచు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:38 PM

రైలు ప్రయాణం అంటేనే ఓ వింత అనుభూతి. దూర ప్రయాణాలు చేసే వారు చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. ఎత్తైన కొండల్లో, పచ్చని ప్రకృతి మధ్య రైలు ప్రయాణం చేయడం..

Viral Video: రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి చుట్టేసిన పొగమంచు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

రైలు ప్రయాణం అంటేనే ఓ వింత అనుభూతి. దూర ప్రయాణాలు చేసే వారు చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. ఎత్తైన కొండల్లో, పచ్చని ప్రకృతి మధ్య రైలు ప్రయాణం చేయడం.. ఓ మధురానుభూతి అనే చెప్పొచ్చు. ప్రయాణికులకు రైలు ప్రయాణం ఆహ్లాదాన్ని అందిస్తే.. డ్రైవర్లకు మాత్రం అప్పుడప్పుడూ అనేక సవాళ్లను ముందుంచుతుంటుంది. అయినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైలు ప్రయాణ సమయలో ఉన్నట్టుండి పొగమంచు చుట్టేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

భారతీయ రైల్వేకి (Indian Railways) సంబంధించిన అనేక రకాల వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ (Viral videos) అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రయాణికులతో బయలుదేరిన ఓ రైలు కాసేపటికి వేగం పుంజుకుంటుంది. అయితే మరికాసేపటికి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి పొగమంచు (fog) రైలును చుట్టేస్తుంది. ఇంకాసేపటికి పూర్తిగా దారి కనపడనంతగా మారిపోతుంది.

Viral Video: అర్ధరాత్రి మద్యం మత్తులో కారు ఎక్కిన యువతి.. చివరకు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఏమంటున్నారంటే..

అయినా రైల్లో ఉన్న ఇద్దరు లోకోపైలెట్లు ఏమాత్రం కంగారుపడకుండా.. రైలును మరింత వేగంగా నడుపుతారు. దీంతో రైలు పొగమంచు మధ్య విమానంలా దూసుకుపోతుంది. కాసేపటికి పొగమంచును చీల్చుకుంటూ వెళ్లిపోతుంది. ఈ వీడియోను assistant_loco_pilot400 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇండియన్ రైల్వేకి.. సెల్యూట్’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైలు స్వర్గంలోకి వెళ్తున్నట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రయాణికులకు ఈ అనుభూతి ఎప్పటికీ గుర్తుంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరే..! వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

Updated Date - Jan 05 , 2024 | 08:38 PM