Share News

Viral Video: రోడ్డుపై వెళ్తున్న ఈ చిన్నారి.. తన నీడను చూడగానే షాక్.. చివరకు ఏం చేశాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:43 PM

పిల్లల ప్రవర్తన కొన్నిసార్లు విసుగు తెప్పిస్తే మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. అందుకే పిల్లలు ఉన్న ఇళ్లు సందడి సందడిగా కనిపిస్తుంటాయి. ఇక...

Viral Video: రోడ్డుపై వెళ్తున్న ఈ చిన్నారి.. తన నీడను చూడగానే షాక్.. చివరకు ఏం చేశాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

పిల్లల ప్రవర్తన కొన్నిసార్లు విసుగు తెప్పిస్తే మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. అందుకే పిల్లలు ఉన్న ఇళ్లు సందడి సందడిగా కనిపిస్తుంటాయి. ఇక బుడిబుడి అడుగులు వేసే వయసులో పిల్లల చేష్టలు చూడముచ్చటగా ఉంటాయి. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఓ బుడ్డోడు రోడ్డుపై వెళ్తుండగా.. సడన్‌గా తన నీడను చూసుకుని షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బుడ్డోడు రోడ్డుపై బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడుస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే తమాషా ఘటన చోటు చేసుకుంది. ఎండలో వెళ్తుండడంతో పిల్లాడి నీడ పడింది. ముందు గమనించకున్నా.. కాసేపటికి తర్వాత తన నీడను తాను చూసుకుని (child scared saw his shadow) భయపడిపోతాడు. ఎదో వింత ఆకారం తనను వెంబడిస్తున్నట్లుగా ఊహించుకుని ఏడుపు అందుకుంటాడు.

Viral Video: పిల్లిని ఎత్తుకెళ్లాలని వచ్చిన డేగ.. చివరికి ఎలా ఫూల్ అయిందో చూడండి..

తన నీడ నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరుగెత్తుతాడు. అయితే ఈసారి తన నీడ తనకు ఎదురుగా పడుతుంది. అప్పటిదాకా వెనుక ఉన్న నీడ.. సడన్‌గా ముందుకు మారడంతో మరింత భయపడతాడు. గట్టిగా ఏడుస్తూ వేగంగా వెనక్కు వెళ్తాడు. ఈ క్రమంలో అదుపు తప్పి ధబేల్‌మని కిందపడిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడు.. భలె నవ్వించాడు’’.. అంటూ కొందరు, ‘‘పాపం.. దెయ్యం అనుకున్నాడేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పాము, ముంగిస మధ్య వెరైటీ ఫైట్.. చివరకు ముంగిస చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

Updated Date - Jan 03 , 2024 | 10:04 PM