Share News

Viral: చైనీయులు బలంగా నమ్మే ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..

ABN , Publish Date - Jan 04 , 2024 | 06:26 PM

సామాన్యుల నంచి ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరికీ సమస్యలు మాత్రం కామన్‌గా వస్తుంటాయి. వారి వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ క్రమంలో

Viral: చైనీయులు బలంగా నమ్మే ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..

సామాన్యుల నంచి ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరికీ సమస్యలు మాత్రం కామన్‌గా వస్తుంటాయి. వారి వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది తమ కష్టాలు తొలగిపోయేందుకు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. కొందరు జ్యోతిష్యాన్ని నమ్మి పూజలు చేస్తుంటే.. మరికొందరు వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంట్లో అనేక రకాల మార్పులు చేసుకుంటుంటారు. అయితే చైనీయులు బలంగా నమ్మే కొన్ని వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు తీరిపోతాయట. అవేంటో తెలుసుకుందాం.

తాబేలు

turtle.jpg

చైనీస్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఫెంగ్ షుయ్ వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు తొలగిపోవడంతో పాటూ ఆదాయం కూడా వస్తుందని నమ్ముతారు. ఈ రకం వస్తువుల్లో తాబేలు ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం అని నమ్ముతుంటారు. ఇంట్లో ఉత్తర భాగంలో తాబేలు బొమ్మను ఉంచడం వల్ల కెరీర్ బాగుంటుందని చైనీయులు నమ్ముతారు.

లాఫింగ్ బుద్ధ

budha.jpg

ఫెంగ్ షుయ్ ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. ఇంటి ఆగ్నేయ భాగంలో ఈ విగ్రహాన్ని ఉంచడం సంపద, ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. అలాగే బుద్ధుడి బొడ్డును తాకడం వల్ల అదృష్టం వస్తుందని కూడా చెబుతుంటారు.

విండ్ చైమ్స్

wind.jpg

విండ్ చైమ్స్ వస్తువులు ఇంట్లో ఉంటే సానుకూల వాతావరణం ఉంటుందట. వీటి శ్రావ్యమైన శబ్ధాలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతుంటారు. ఇంటికి ప్రవేశ ద్వారం వద్ద వీటిని వేలాడదీస్తే మేలు జరుగుందట.


స్ఫటికాలు

dolls.jpg

స్ఫటిక వస్తువుల ఇంట్లో ఉంటే సానుకూల శక్తి విస్తరిస్తుందట. వీటిని కిటికీల వద్ద ఉంచితే సూర్యరశ్మిని తీసుకుని లోపలికి పంపుతుంది. ఈ వస్తువుల కారణంగా ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు.

మనీ ట్రీ

money-tree.jpg

మనీ ట్రీ ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు సొంత మవుతుందని చైనీయులు నమ్ముతారు. ఇంట్లో ఆగ్నేయ మూలలో ఈ వస్తువు ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుందట.

డ్రాగన్..

drogan.jpg

డ్రాగన్ వస్తువులు ఇంట్లో బలం, ధైర్యం, విజయం ఉన్నట్లే అని ప్రజలు నమ్ముతుంటారు. ఇంట్లోని ఆగ్నేయ ప్రదేశాల్లో ఈ వస్తువులు ఉంటే అదృష్టం వరిస్తుందట.

ఫూ కుక్కలు

dogs.jpg

ఫూ కుక్క బొమ్మలు ఇంట్లో ఉండడం వల్ల రక్షణ ఉంటుందట. ఇంటి ప్రవేశ ద్వారాం వద్ద ఒక జత ఫూ కుక్క బొమ్మలు పెడితే ప్రతికూల శక్తి దూరమై.. శ్రేయస్సు చేకూరుతుందట.

మూడు కాళ్ల కప్ప

frog.jpg

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో మూడంచెల కప్ప ఉండటం శ్రేయస్కరం. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లాభాలు చేకూరుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటి లాకర్ దగ్గర ఈ బొమ్మలను ఉంచుకోవాలి.

Updated Date - Jan 04 , 2024 | 06:26 PM