Share News

Viral Video: డెలివరీ బాయ్ ముందే ఫోన్ అన్‌బాక్స్ చేయగా షాకింగ్ సీన్.. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేస్తే..

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:31 PM

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా.. ఎలాంటి ఆహారం తినాలన్నా.. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేయడం సర్వసాధారణమైపోయింది. వందల రూపాయలు మొదలుకొని వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు చేసేస్తుంటారు. అయితే

Viral Video: డెలివరీ బాయ్ ముందే ఫోన్ అన్‌బాక్స్  చేయగా షాకింగ్ సీన్.. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేస్తే..

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా.. ఎలాంటి ఆహారం తినాలన్నా.. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేయడం సర్వసాధారణమైపోయింది. వందల రూపాయలు మొదలుకొని వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు చేసేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. రావాల్సిన ఆర్డర్ మధ్యలోనే క్యాన్సిల్ అవడం, ఒకవేళ వచ్చినా.. ఒకటి చేస్తే ఇంకోటి రావడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేయగా.. తీరా అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతిన్నాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.27వేల ఫోన్‌ను ఆర్డర్ పెడతాడు. డెలివరీబాయ్ సదరు పార్సిల్‪‌ను తీసుకుని యువకుడి ఇస్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫోన్ బాక్సును డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేయగా.. చివరకు అందులో షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. బాక్సులో ఫోన్‌కు బదులుగా రూ.10లు విలువైన సబ్బు ఉండడం (Soap in phone box) చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Viral Video: రోడ్డుపై వెళ్తున్న ఈ చిన్నారి.. తన నీడను చూడగానే షాక్.. చివరకు ఏం చేశాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు వచ్చిందేంటీ.. అని డెలివరీ బాయ్‌ను నిలదీస్తాడు. ఇందుకు అతను.. నాకేం తెలీదు.. మీరు కంపెనీని సంప్రదించి ఫిర్యాదు చేయండి అని సలహా ఇస్తాడు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డెలివరీ బాయ్‌ది తప్పు ఏముందీ.. కంపెనీని ప్రశ్నించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఎందులో పడితే అందులో ఆర్డర్ చేస్తే ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ‘‘కావాలనే ఇలా వీడియో తీశారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాము, ముంగిస మధ్య వెరైటీ ఫైట్.. చివరకు ముంగిస చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

Updated Date - Jan 04 , 2024 | 04:31 PM