Share News

Viral Video: అరే..! వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

ABN , Publish Date - Jan 05 , 2024 | 02:59 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఎక్కడ ఏ చిన్న విచిత్ర ఘటన జరిగినా.. వెంటనే నెట్టింట్లోకి వచ్చి పడుతోంది. వీటిలో వినూత్నంగా ఉన్న వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం...

Viral Video: అరే..!  వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఎక్కడ ఏ చిన్న విచిత్ర ఘటన జరిగినా.. వెంటనే నెట్టింట్లోకి వచ్చి పడుతోంది. వీటిలో వినూత్నంగా ఉన్న వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఏ వీధిలో ఏం జరిగినా క్షణాల్లో నెటిజన్ల వరకూ చేరుతోంది. తాజాగా, ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పెంపుడు కుక్కతో కలిసి రోడ్డు పైకి వచ్చిన ఆమెకు ఓ వ్యక్తి పెద్ద షాకే ఇచ్చాడు. పోడ్లాకుంటున్న కుక్కలను అదిలించాల్సింది పోయి.. ఇతను చేసిన పని చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) తన పెంపుడు తీసుకుని వాకింగ్‌కు (walking) బయలుదేరుతుంది. రోడ్డుపై నడుస్తూ వెళ్తూ.. ఓ వీధిలోకి ఎంటరవుతుంది. అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. కొన్ని కొత్త కుక్కలు యువతిని చట్టుముడతాయి. యువతి పెంపుడు కుక్కపై (pet dog) దాడి చేయాలని ప్రయత్నిస్తాయి. దీంతో తన కుక్కను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె వాటిని పక్కకు తోలే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి అక్కడికి హడావుడిగా వస్తాడు. కుక్కలను అదిలించి యువతిని కాపాడతాడు అనుకుంటే.. చివరకు అందుకు విరుద్ధంగా చేశాడు.

Viral Video: వామ్మో! ఇదేందయ్యా... ఇదీ.. ఈ వీడియో చూస్తే ఎవరైనా న్యూడిల్స్ తింటారా.. !

వేగంగా అక్కడికి వచ్చిన అతను.. ఒక్కసారిగా యువతిని బలంగా పక్కకు నెట్టేస్తాడు. దీంతో ఆమె ధబేల్‌మని రోడ్డుపై పడిపోతుంది. కనీసం జాలి కూడా చూపకుండా తన కుక్కల వద్దకు వెళ్తాడు. షాక్ నుంచి కోలుకుని పైకి లేచిన యువతి.. ‘‘వీడితో మనకెందుకులే’’.. అనుకుంటూ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతుంది. తర్వాత అతను తన పెంపుడు కుక్కలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడికి ఎంత అహంకారం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘వీన్ని వీధి కుక్కలతో కరిపించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గీజర్‌గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడినీరు ఎలా వస్తుందో చూడండి..

Updated Date - Jan 05 , 2024 | 02:59 PM