Share News

Viral: ఒక మహిళ.. 6 హత్యలు.. ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా.. టాప్-3లో రియల్ క్రైమ్ స్టోరీ..

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:58 PM

ఓటీటీల్లో క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన కర్రీ అండ్ సైనైడ్.. అనే డాక్యుమెంటరీ సినిమా ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా టాప్-3లో దూసుకుపోతోంది.

Viral: ఒక మహిళ.. 6 హత్యలు.. ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా.. టాప్-3లో రియల్ క్రైమ్ స్టోరీ..

ప్రస్తుతం ఓటీటీలో వచ్చే సినిమాలు, సీరియ్స్, వెబ్ సిరీస్‌కు ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండంతో చాలా మంది థియేటర్ల కంటే ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్నారు. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీల్లో హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల ఓటీటీల్లో క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన కర్రీ అండ్ సైనైడ్.. అనే డాక్యుమెంటరీ సినిమా ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా టాప్-3లో దూసుకుపోతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో కర్రీ అండ్ సైనైడ్ అనే డాంక్యుమెంటరీ మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. ఇందులో రెమో రాయ్, రోజో థామస్, రెంజి విల్సన్, కేజీ సైమన్, జాలీ జోసెఫ్, మేఘన శ్రీవాస్తవ్, నిఖిలా హెన్రీ, సీఎస్ చంద్రిక, బీఏ అలూర్ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ డాక్యుమెంటరీ 2023 డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జాతీయ అవార్డు విజేత, దర్శకుడు క్రిస్టో టామీ.. ఈ డాక్యుమెంటరీని నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించారు.

Viral Video: వామ్మో! ఇదేందయ్యా... ఇదీ.. ఈ వీడియో చూస్తే ఎవరైనా న్యూడిల్స్ తింటారా.. !

Curry-and-Cyanide.jpg

కేరళలో 2022లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. జాలీ జోసఫ్ అనే మహిళ 6 హత్యలు చేయడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. 2002 నుంచి 2016 మధ్య ఆమె ఈ హత్యలకు పాల్పడింది. ఇన్నేళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా హత్యలు చేసింది. ఆమె చేసిన ఆరు హత్యల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తన కుటుంబ సభ్యులను చంపేందుకు ఆహారంలో సైనేడ్ కలిపింది. ఇంత తెలివిగా హత్యలు చేసినా.. చివరకు ఎలా బయటపడ్డాయి, అసలు ఆమె ఈ హత్యలు చేయడానికి కారణాలు ఏంటీ, ఈ హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణంగా ఈ డాక్యుమెంటరీ నడుస్తుందన్నామాట. ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో టాప్-3లో కొనసాగుతోంది.

Viral Video: రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్న భేల్ పూరీ వ్యాపారి.. ఇంతకీ ఇతడి వ్యాపార టెక్నిక్ ఏంటో మీరే చూడండి..

Updated Date - Jan 04 , 2024 | 09:58 PM