Share News

Viral Video: వామ్మో..! ఈమేంటీ.. ట్రైన్‌లో సీటు కోసం మరీ ఇలా చేసిందేంటీ..

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:10 AM

బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు సీటు కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. పురుషులైతే పక్కన ఉన్న వారిని తోసుకుంటూ వెళ్లి మరీ సీటు సంపాదిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే...

Viral Video: వామ్మో..! ఈమేంటీ.. ట్రైన్‌లో సీటు కోసం మరీ ఇలా చేసిందేంటీ..

బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు సీటు కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. పురుషులైతే పక్కన ఉన్న వారిని తోసుకుంటూ వెళ్లి మరీ సీటు సంపాదిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే కొందరు మాత్రం పురుషులతో సమానంగా సీటు కోసం పోటీ పడుతుంటారు. కొందరైతే సీటు కోసం చిత్రవిచిత్ర సాహసాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రైల్లో ఓ మహిళ సీటు కోసం పెద్ద సాహసమే చేసింది. ఆమె తీరు చూసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అందరితో పాటే మెట్రో రైలు ఎక్కింది. అయితే బోగీలో సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. కనీసం నిలబడటానికి కూడా స్థలం లేదు. లోపలికి వచ్చిన ఆమె చాలా సేపు నిలబడింది. కొద్దిసేపటికి ఆమెకు ఓపిక నశించింది. ‘‘ఇక నా వల్ల కాదు.. ఎలాగైనా సీట్లో కూర్చోవాల్సిందే’’.. అని అనుకుంటూ అటూ, ఇటూ చూసింది. ఎదురుగా చాలా మంది పురుషులు కూర్చుని ఉండడం చూసి వారి వద్దకు వెళ్లింది.

Viral Video: యువతి సముద్రం ఒడ్డున స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఏమైందో చూండండి..

ప్లేస్ ఇవ్వాలని వాళ్లను అడిగినా ఎలాంటి స్పందనా రాదు. దీంతో చివరకు ఆమెకు చిర్రెత్తుకొచ్చి.. వారి మధ్య బలవంతంగా కూర్చుంది. సడన్‌గా ఆమె ఇలా చేసేసరికి.. అక్కడ కూర్చున్న వ్యక్తి లేచి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు చివరకు స్థలం దొరికేసింది. ఆమె నిర్వాకానికి అక్కడున్న మహిళలు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె దౌర్జన్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అంతా అవాక్కయ్యేలా చేసిందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ చెట్టులో దాక్కున్న తొండను గుర్తించడం మీ వల్ల అవుతుందా..?

Updated Date - Mar 20 , 2024 | 05:27 PM