Share News

Viral Video: కౌగిలించుకోవాలని ప్రేయసి ప్రేమతో వస్తే.. ప్రియుడు చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Mar 13 , 2024 | 08:14 PM

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో చాలా మంది ప్రేమికులు,, చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా...

Viral Video: కౌగిలించుకోవాలని ప్రేయసి ప్రేమతో వస్తే.. ప్రియుడు చేసిన నిర్వాకం చూడండి..

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో చాలా మంది ప్రేమికులు,, చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలికి ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రియుడిని కౌగిలించుకోవాలని ఎంతో ప్రేమతో వస్తే.. చివరకు అతను చేసిన పని చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట సినిమా స్టైల్లో ఓ వీడియో తీయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందుకోసం ఇద్దరూ ఇసుక దిబ్బల వద్దకు వెళ్తారు. ముందుగా ప్రియుడు చేతిలో రోజా పువ్వు పట్టుకుని నిల్చుని ఉంటాడు. దూరంగా నిలబడి ఉన్న అతడి ప్రియురాలు.. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కౌగిలించుకోవాలనేది వారి ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఇద్దరూ ఎదురెదురుగా నిలబడతారు. కెమెరా ఆన్ చేయగానే యువతి వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. చేతులు చాపి అతన్ని కౌగిలించుకోవాలని చూస్తుంది.

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

అయితే సమీపానికి రాగానే అతను ఒక్కసారిగా కింద కూర్చుండిపోతాడు. దీంతో ఆమె వేగాన్ని అదుపు చేయలేక.. అలాగే అతడి మీద నుంచి ఇసుకలో జారుకుంటూ కిందకు వెళ్లిపోతుంది. ప్రేయసిని ఆట పట్టించిన అతను.. నవ్వుతూ తన ప్రేయసి వద్దకు జారుకుంటూ వెళ్తాడు. అలాగే ఇంకో ఘటనలో ఇద్దరు ప్రేమికులు బెంచిపై కూర్చుని ఒకరిపై ఇంకొకరు ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రేయసి తన ప్రియుడిని ముద్దుగా పిలుస్తూనే చివరకు ‘‘ఓ మేరా కర్రోడా’’.. అంటూ అట పట్టిస్తుంది. దెబ్బకు ప్రియుడు మొఖం వాడిపోతుంది. ఈ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. కోడిని చూపించి మరో కోడిని ఎలా కొట్టేశారో చూస్తే..

Updated Date - Mar 18 , 2024 | 01:42 PM