Share News

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:05 PM

సుదూర ప్రయాణాలు చేసే వారు హాయిగా నిద్రపోయేందుకు వీలుగా సీట్లు బుక్ చేసుకుంటారు. మరికొందరు తమ ప్రయాణం లగ్జరీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణికుల సంగతి పక్కన పెడితే వాహనాలు నడిపే వారి పరిస్థితి ఏంటి.. ? అనే సందేహం వస్తుంది. బస్సు, రైలు డ్రైవర్లు ఎలా విశ్రాంతి తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే..

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

సుదూర ప్రయాణాలు చేసే వారు హాయిగా నిద్రపోయేందుకు వీలుగా సీట్లు బుక్ చేసుకుంటారు. మరికొందరు తమ ప్రయాణం లగ్జరీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణికుల సంగతి పక్కన పెడితే వాహనాలు నడిపే వారి పరిస్థితి ఏంటి.. ? అనే సందేహం వస్తుంది. బస్సు, రైలు డ్రైవర్లు ఎలా విశ్రాంతి తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే విమాన ప్రయాణంలో పైలెట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంటుంది. ఆ సందేహానికి సమాధానంగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ విమాన పైలెట్ క్యాబిన్ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు (Ethiopian Airlines) చెందిన పైలెట్ క్యాబిన్ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుదీర్ఘ విమాన ప్రయాణంలో పైలెట్లు ఎలా విశ్రాంతి తీసుకుంటారు..? అనే సందేహాలకు సమాధానంగా ఓ వ్యక్తి పైలెట్ క్యాబిన్‌ను (Pilot cabin) తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోలో విమానంలో పైలెట్ తన సీట్లో కూర్చుని ఉంటాడు. ఆ గదికి పక్కనే ఇంకో క్యాబిన్ కూడా ఉంటుంది. అందులో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ కుర్చీ ఉంటుంది. అలాగే దానికి వెనుక పైభాగంలో పైలెట్లు పడుకునేందుకు వీలుగా బెడ్స్ వేసి ఉంటాయి. పైలెట్లకు నిద్ర వచ్చిన సమయంలో ఒకరి తర్వాత ఒకరుగా అందులో విశ్రాంతి తీసుకుంటారు.


Viral Video: ఉడకబెట్టిన గుడ్డుతో ఐ ఫోన్‌పై ప్రయోగం.. చివరకి ఏం జరిగిందో చూడండి..

అయితే తాజాగా, ఇండోనేసియాలో 153 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్ పైలెట్లు ఇద్దరూ ఒకేసారి నిద్రలోకి జారుకున్న విషయం తెలిసిందే. దీంతో విమానం దారి తప్పింది. సులవేసి నుంచి జకర్తాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విమాన సిబ్బంది సహా 153 మంది ప్రయాణికులు క్షేమంగా ల్యాండ్ అయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో పైలెట్ల క్యాబిన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పైలెట్లు ఇద్దరికీ ఒకేసారి నిద్ర వస్తే.. పరిస్థితి ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘ప్రయాణికుల సీట్ల కంటే పైలెట్లు విశ్రాంతి తీసుకునే బెడ్స్ దారుణంగా ఉన్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ఐడియా ఎప్పుడైనా వచ్చిందా.. ఈమె అతి తెలివి చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..

Updated Date - Mar 13 , 2024 | 05:05 PM