Share News

Viral Video: అంత శక్తివంతమైన ఏనుగు.. మనుషులు చేసే పనిని.. ఎంత సున్నితంగా చేస్తోందో చూస్తే..

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:28 PM

చూడటానికి భయం కలిగించే పులులు, సింహాలు, ఏనుగులు కొన్నిసార్లు అందరినీ తెగ నవ్విస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనలు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. వేటాడే జంతువైన పులి.. అందుకు విరుద్ధంగా ప్లాస్టిక్ బాటిళ్లను ఎత్తడం ఎత్తేయడం చూశాం, చంపాల్సిన జంతువులపై...

Viral Video: అంత శక్తివంతమైన ఏనుగు.. మనుషులు చేసే పనిని.. ఎంత సున్నితంగా చేస్తోందో చూస్తే..

చూడటానికి భయం కలిగించే పులులు, సింహాలు, ఏనుగులు కొన్నిసార్లు అందరినీ తెగ నవ్విస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనలు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. వేటాడే జంతువైన పులి.. అందుకు విరుద్ధంగా ప్లాస్టిక్ బాటిళ్లను ఎత్తడం ఎత్తేయడం చూశాం, చంపాల్సిన జంతువులపై ప్రేమ కురిపించిన సింహాలను చూశాం, అలాగే చిన్నపిల్లలకు సాయం చేసే ఏనుగులను కూడా చూశాం. తాజాగా, ఓ ఏనుగు చేసిన విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మనుషులకు రోజూ ఏదో ఒక సందర్భంలో తలెత్తే సమస్యే.. ఏనుగుకూ వచ్చింది. అంత శక్తివంతమైన ఏనుగు.. చివరకు ఎంతో సున్నితంగా ఆ పని చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. మనుషులకు అప్పుడప్పుడూ తలెత్తే సమస్యే.. ఓ ఏనుగుకూ వచ్చింది. మనుషులకు శరీరంలో దురద కలిగితే వెంటనే చేత్తో లేదా ఏదో ఒక వస్తువుతో గోక్కోవడం సర్వసాధారణం. అయితే ఇదే సమస్య ఓ ఏనుగుకూ (elephant) వచ్చింది. అంత శక్తివంతమైన ఏనుగుకు ఒక్కసారిగా కాలు దురద పుట్టినట్లు ఉంది. కాలిని నేలకేసి రాస్తే దురదపోయే అవకాశం ఉన్నా.. ఏనుగు ఎంతో తెలివిగా వ్యవహరించింది. అలా చేస్తే కాలికి గాయం అవుతుందని అనుకుందో ఏమో గానీ.. మనుషుల తరహాలో చాలా తెలివిగా ఆలోచించింది. అటూ ఇటూ చూడగా.. చివరకు దానికి ఓ పెద్ద కర్ర పుల్ల కనిపించింది.

Viral Video: కొంపముంచిన హైనా.. జింకపై ప్రేమ కురిపించిన పులి.. చివరకు మనసు ఎలా మార్చుకుందంటే..

దాన్ని తొండంతో ఎంతో చాకచక్యంగా తీసుకుని, కాలిపై దురద పుట్టిన ప్రాంతంలో మనుషుల తరహాలోనే గోక్కోవడం మొదలెట్టింది. ఎంతో సున్నితంగా కర్ర పుల్లతో అది చేసిన పని చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు ఎంతో తెలివిగా వ్యవహరించింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోబ్రాతో కోతి ఫన్నీ గేమ్.. తల మీద ఒక్కటి ఇవ్వగానే.. పాము రియాక్షన్ ఏంటంటే..

Updated Date - Mar 12 , 2024 | 05:28 PM