Share News

Viral Video: డాన్స్ చేస్తున్న యువతి.. యువకుల నుంచి డబ్బులెలా తీసుకుంటుందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:05 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ఓ యువతి (Young woman ) స్టేజిపై డాన్స్ చేస్తూ ఉంటుంది. స్టేజి కింద చాలా మంది యువకులు ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు ఆమె వద్దకు వెళ్లి డబ్బులు కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ యువకుడు...

Viral Video: డాన్స్ చేస్తున్న యువతి.. యువకుల నుంచి డబ్బులెలా తీసుకుంటుందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ అప్‌డేట్ అవుతున్నారు. చదువు రాని వారు కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగించడం, ఆన్‌లైన్ ఆర్డర్లు చేయడం, నగదు చెల్లింపులను యూపీఐ ద్వారా చేయడం వంటివి అలవాటుగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం రూపాయి దగ్గర నుంచి వేల రూపాయల వరకూ ఎక్కువ భాగం డిజిటల్ చెల్లింపులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి డాన్స్ చేస్తూనే యువకుల నుంచి డబ్బులు తీసుకునే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో ఓ యువతి (Young woman ) స్టేజిపై డాన్స్ చేస్తూ ఉంటుంది. స్టేజి కింద చాలా మంది యువకులు ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు ఆమె వద్దకు వెళ్లి డబ్బులు కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ యువకుడు డబ్బులు ఇవ్వడానికి ఆమె వద్దకు వెళ్తాడు. అయితే ఆమె క్యాష్ తీసుకునేందుకు అంగీకరించదు. రెండో సారి ఇచ్చాక కూడా తీసుకోకుండా తన చేతిలోని ఫోన్ చూపిస్తుంది.

Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీది కత్తి లాంటి చూపే..

యూపీఐ (UPI) ద్వారా చెల్లించమని చెప్పకనే చెప్పడంతో.. యువకుడికి విషయం అర్థమై, వెంటనే తన చేతిలోని ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ (QR code) స్కాన్ చేసి, నగదును పంపిస్తాడు. డబ్బులు ట్రాన్ఫర్ అయిన తర్వాత ఆమెకు ఫోన్ చూపించి చెప్తాడు. ఇలా సదరు యువతి డాన్స్ చేస్తూనే.. యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి చాలా అప్‌డేట్ అయిందే’’.. అంటూ కొందరు, ‘‘యూపీఐని ఇలాక్కూడా వాడుతున్నారన్నమాట’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

Viral: రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన డ్రైవర్.. లారీని శుభ్రం చేస్తుండగా వచ్చిన ఆ ఒక్క ఆనుమానమే..

Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీది కత్తి లాంటి చూపే..

Viral Video: దుకాణం బయట నిల్చున్న వృద్ధురాలు.. అంతలోనే ఎలా గాల్లోకి లేచిందో చూస్తే.. షాక్ అవుతారు...

Updated Date - Mar 10 , 2024 | 03:05 PM