Share News

Viral Video: చైనా హోటల్లో ట్రావెలర్‌కు వింత అనుభవం.. గది తలుపు తీయగానే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 07:16 PM

రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనిషి చేయాల్సిన పనులన్నీ రోబోలే చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే అనేక విభాగాల్లో మనుషులకు బదులుగా రోబోలను ఏర్పాటు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ..

Viral Video: చైనా హోటల్లో ట్రావెలర్‌కు వింత అనుభవం.. గది తలుపు తీయగానే..

రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనిషి చేయాల్సిన పనులన్నీ రోబోలే చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే అనేక విభాగాల్లో మనుషులకు బదులుగా రోబోలను ఏర్పాటు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ట్రావెలర్‌కు చైనాలో ఊహించని అనుభం ఎదురైతంది. హోటల్ గదిలో ఉన్న అతను ఫుడ్ ఆర్డర్ చేశాడు. చివరకు తలుపు తెరచి చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ట్రావెలర్ చైనాలో పర్యటిస్తూ ఓ హోటల్లో (China Hotel) గది బుక్ చేసుకున్నాడు. కాసేపటికి ఫుడ్ కోసం హోటల్ సిబ్బందికి కాల్ చేశాడు. కాల్ చేసిన కొద్ది సేపటికి తలుపు తీసి చూడగా.. ఎదురుగా మనిషి బదులుగా రోబో (Robot) ఉండడం చూసి అవాక్కాడు. దగ్గరికి వెళ్లి రోబోపై బటన్ నొక్కడంతో గ్లాస్ తెరుచుకుని, అతడికి కావాల్సిన ఆహారం అక్కడ సిద్ధంగా ఉంది.

Viral Video: ఇన్విజిలేటర్ అవతారం ఎత్తిన పిల్లి.. పరీక్ష హాల్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..

పార్సిల్ తీసుకున్న అతను మళ్లీ బటన్ నొక్కగానే గ్లాసు మూసుకుపోతుంది. ఆ రోబో అతడితో చైనీస్ బాషాలో సమాధానాలు ఇవ్వడంతో పాటూ ధన్యవాదాలు కూడా తెలియజేసింది. తన గదికి రోబో ఆహారం తీసుకురావడం చూసి అతను ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ టెక్నాలజీ ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘వీటి వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోతారు’’.. అంటూ మరికొందరు, ‘‘టెక్నాలజీని స్వాగతించక తప్పదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: డాన్స్ చేస్తున్న యువతి.. యువకుల నుంచి డబ్బులెలా తీసుకుంటుందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

Updated Date - Mar 10 , 2024 | 07:16 PM