Share News

Viral Video: కోబ్రాతో కోతి ఫన్నీ గేమ్.. తల మీద ఒక్కటి ఇవ్వగానే.. పాము రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:04 PM

జంతువుల మధ్య అప్పడప్పుడూ సరదా సంఘటనలు చోటు చేసుకుంటాయి. బద్ధశత్రువులైన జంతువులు కూడా కొన్నిసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తూ ఉంటాం. కోతి మిగతా జంతువులను ఆట పట్టించడం చూడటానికి భలే సరదాగా ఉంటుంది. పెద్ద పులిని పిల్లిలాగా చేసి ఓ ఆట ఆడుకున్న కోతులను చాలా సార్లు చూశాం. తాజాగా...

Viral Video: కోబ్రాతో కోతి ఫన్నీ గేమ్.. తల మీద ఒక్కటి ఇవ్వగానే.. పాము రియాక్షన్ ఏంటంటే..

జంతువుల మధ్య అప్పడప్పుడూ సరదా సంఘటనలు చోటు చేసుకుంటాయి. బద్ధశత్రువులైన జంతువులు కూడా కొన్నిసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తూ ఉంటాం. కోతి మిగతా జంతువులను ఆట పట్టించడం చూడటానికి భలే సరదాగా ఉంటుంది. పెద్ద పులిని పిల్లిలాగా చేసి ఓ ఆట ఆడుకున్న కోతులను చాలా సార్లు చూశాం. తాజాగా, ఓ కోతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బుసలు కొడుతున్న నాగుపాముతో కోతి సరదాగా ఆడుకుంది. పడగ ఎత్తగానే తల మీద ఒక్కటి ఇవ్వడంతో పాము ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి (monkey) పచ్చని పొలాల మధ్య రాయిపై కూర్చుని హాయిగా సేద తీరుకూ ఉంటుంది. అదే సమయంలో రెండు పాములు అక్కడికి వస్తాయి. కోతి వద్దకు రాగానే రెండూ పడగ విప్పి బుసలు కొడతాయి. అయినా కోతి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన ధ్యాసాలో తాను ఉంటుంది. వాటిలో ఓ పాము (Cobra) కోతి సమీపానికి వెళ్లి మరీ బుసలు కొడుతుంది. దీంతో కోతి దాని చూసి.. ‘‘ఏంటమ్మా.. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంటే.. డిస్టర్బ్ చేస్తావ్.. నీలాంటి పాములను చాలా చూశా.. పక్కకు వెళ్లి ఆడుకో’’.. అన్నట్లుగా దాని తలపై సున్నితంగా కొడుతూ హెచ్చరిస్తుంది.

Viral Video: ఇన్విజిలేటర్ అవతారం ఎత్తిన పిల్లి.. పరీక్ష హాల్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..

పాము ఎన్నిసార్లు బుసలు కొట్టినా.. కోతి దాని కాటు నుంచి తప్పించుకుంటూ.. పామును పదే పదే కొడుతూనే ఉంటుంది. దీంతో ‘‘ఈ కోతిని భయపెట్టడం నావల్ల కాదు బాబోయ్..’’.. అన్నట్లుగా పాము అక్కడి నుంచి పారిపోతుంది. పక్కనే పాము మాత్రం కోతి వద్దకు వెళ్లే సాహసం చేయకుండా.. దూరం నుంచి చూస్తూ ఉండిపోతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హనుమంతుడి ముందు కుప్పిగంతులా’’.. అంటూ కొందరు, ‘‘పాముతో భలే ఆడుకుందే’’.. అంటూ మరికొందరు, ‘‘పక్కన ఉన్న వారు కావాలనే ఇదంతా చేసినట్లు ఉంది.. పొరపాటున కాటు వేస్తే పరిస్థితి ఏంటీ’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గూస్‌బమ్స్ తెప్పించే సీన్.. యువతిని జలపాతం నుంచి కిందకు తోయగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Mar 10 , 2024 | 09:08 PM