Share News

Viral Video: గూస్‌బమ్స్ తెప్పించే సీన్.. యువతిని జలపాతం నుంచి కిందకు తోయగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 07:59 PM

ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుంది. కొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటే.. మరికొందరికి వినూత్న సాహసాలు చేయడం అంటే సరదా. కొందరైతే ప్రమాదకర సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: గూస్‌బమ్స్ తెప్పించే సీన్.. యువతిని జలపాతం నుంచి కిందకు తోయగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుంది. కొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటే.. మరికొందరికి వినూత్న సాహసాలు చేయడం అంటే సరదా. కొందరైతే ప్రమాదకర సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వినూత్న సాహసం చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. జలపాతం పైనుంచి ఆమెను తోయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని వందల అడుగుల ఎత్తైన జలపాతంపై (waterfall) ఓ యువతి నిలబడి ఉంటుంది. ఆమె నడుముకు తాళ్లు కట్టబడి ఉంటాయి. అంతా సిద్ధమవగానే ఓ వ్యక్తి ఆమెను.. జలపాతం చివరకు తీసుకెళ్లి ఒక్కసారిగా పైనుంచి తోసేస్తాడు. దీంతో యువతి (young woman) తాడు సాయంతో లోయలోకి దూసుకెళ్తుంది. అంత ఎత్తు నుంచి కిందకు దూసుకెళ్లిన ఆమె.. ఊయల తరహాలో అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది.

Viral Video: చైనా హోటల్లో ట్రావెలర్‌కు వింత అనుభవం.. గది తలుపు తీయగానే..

ఈ దృశ్యం చూసేందుకు గూస్‌బమ్స్ తెచ్చించేలా ఉంది. బంగీజంప్ తరహాలో ఉన్న ఈ సాహసానికి పూనుకున్న ఈ యువతిని అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి సాహసం.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 49వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇన్విజిలేటర్ అవతారం ఎత్తిన పిల్లి.. పరీక్ష హాల్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

Updated Date - Mar 12 , 2024 | 01:56 PM