Share News

Viral Video: ఉడకబెట్టిన గుడ్డుతో ఐ ఫోన్‌పై ప్రయోగం.. చివరికి ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Mar 13 , 2024 | 04:14 PM

వాహనాలు, ఇంట్లో వస్తువుల సామర్థ్యం, నాణ్యత తెలుసుకునేందుకు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు. ఇలాంటి పరీక్షల్లో కొన్ని వస్తువుల డొల్లతనం బయటపడితే.. మరికొన్ని వస్తువులు పరీక్షను తట్టుకుని నిలబడుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఉడకబెట్టిన గుడ్డుతో ఐ ఫోన్‌పై ప్రయోగం.. చివరికి ఏం జరిగిందో చూడండి..

వాహనాలు, ఇంట్లో వస్తువుల సామర్థ్యం, నాణ్యత తెలుసుకునేందుకు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు. ఇలాంటి పరీక్షల్లో కొన్ని వస్తువుల డొల్లతనం బయటపడితే.. మరికొన్ని వస్తువులు పరీక్షను తట్టుకుని నిలబడుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఉడకబెట్టిన గుడ్డుతో ఐ ఫోన్‌పై ప్రయోగం చేశాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఐ ఫోన్‌కు (i phone) వింత పరీక్ష పెట్టాడు. ఉడకబెట్టిన గుడ్డును తీసుకుని తన ఫోన్‌పై వింత ప్రయోగం చేశాడు. ఫోన్ వెనుక భాగంలో ఉడకబెట్టిన గుడ్డును (boiled egg) ఉంచి.. దానిపై ఫోన్ కవర్‌ను బలవంతంగా నొక్కి పెడతాడు. ఆ తర్వాత సుత్తెతో కొడుతూ, ఫోన్ కవర్‌పై బలంగా ప్రెస్ చేస్తాడు. ఇలా గుడ్డు మొత్తం చదును అయ్యే వరకూ ప్రెస్ చేస్తాడు.

Viral Video: బస్సు డ్రైవర్ల మనసు దోచుకున్న వృద్ధుడు.. ఇంతకీ ఈయన చేసిన పనేంటంటే..

ఇలా తన ఫోన్ వెనుక భాగం మొత్తాన్ని గుడ్డుతో కవర్ చేస్తాడు. అయినా ఫోన్‌కి ఎలాంటి నష్టం జరగలేదు. ఫోన్ యథావిధిగా పని చేస్తూనే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాల కోసం ఫుడ్ వేస్ట్ చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా దారుణంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ఐడియా ఎప్పుడైనా వచ్చిందా.. ఈమె అతి తెలివి చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..

Updated Date - Mar 13 , 2024 | 04:23 PM