Share News

Viral Video: ఇలాంటి ఐడియా ఎప్పుడైనా వచ్చిందా.. ఈమె అతి తెలివి చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:57 PM

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తుండగా.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: ఇలాంటి ఐడియా ఎప్పుడైనా వచ్చిందా.. ఈమె అతి తెలివి చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తుండగా.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కుక్కర్‌తో చేసిన విచిత్రమైన పని అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంటింట్లో వంట పని చేస్తూనే.. మరోవైపు చొక్కాలను ఇస్త్రీ చేసే పని కూడా పెట్టుకుంది. అయితే ఆమెకు ఆలోచన వచ్చింది. ఇస్త్రీ కోసం అనవసరంగా కరెంట్ ఖర్చు ఎందుకు అనుకుందో ఏమో గానీ.. చివరికి కుక్కర్‌తో పని కానిద్దామని నిర్ణయించుకుంది. కుక్కర్ బాగా వేడెక్కి విజిల్ రాగానే.. స్టవ్ నుంచి దింపి.. (woman ironing shirt with cooker) అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న చొక్కాను ఎంచక్కా ఇస్త్రీ చేసేసింది.

Viral Video: బస్సు డ్రైవర్ల మనసు దోచుకున్న వృద్ధుడు.. ఇంతకీ ఈయన చేసిన పనేంటంటే..

ఇలా ఐరన్ బాక్స్‌తో పని లేకుండా ఒకేసారి అటు వంట పని, ఇటు ఇస్త్రీ పని పూర్తి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పురాతన సమాధిని తవ్వుతుండగా అడుగున షాకింగ్ సీన్.. ఎవరూ ఊహించని విధంగా..

Updated Date - Mar 12 , 2024 | 08:57 PM