Share News

Viral Video: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. కోడిని చూపించి మరో కోడిని ఎలా కొట్టేశారో చూస్తే..

ABN , Publish Date - Mar 13 , 2024 | 06:58 PM

చోరీలకు పాల్పడే సమయంలో కొందరు నేరస్థులు అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎవరికీ అంతుచిక్కని విధంగా చోరీలు చేస్తుంటే.. మరికొందరు పోలీసులు సైతం అవాక్కయ్యేలా చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిన్న చిన్న టెక్నిల‌ను వినియోగించి పెద్ద పెద్ద చోరీలను సైతం ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. కోడిని చూపించి మరో కోడిని ఎలా కొట్టేశారో చూస్తే..

చోరీలకు పాల్పడే సమయంలో కొందరు నేరస్థులు అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎవరికీ అంతుచిక్కని విధంగా చోరీలు చేస్తుంటే.. మరికొందరు పోలీసులు సైతం అవాక్కయ్యేలా చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిన్న చిన్న టెక్నిల‌ను వినియోగించి పెద్ద పెద్ద చోరీలను సైతం ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఓ యువకుడు కోడిని చూపించి మరో కోడిని చోరీ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకులో వెళ్తూ కోడిని (man stole hen) వినూత్నంగా చోరీ చేశారు. బైకులో వెనుక కూర్చున్న వ్యక్తి.. చేతిలో కోడిని పట్టుకుని ఉంటాడు. దారి మధ్యలో బైకు ఆపగానే వెనుక ఉన్న వ్యక్తి కిందకు దిగి.. రోడ్డు పక్కకు వెళ్లి, తన చేతిలోని కోడిని ఎదురుగా ఉన్న మరో తెల్ల కోడికి చూపిస్తాడు. దీంతో తెల్లటి కోడి పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వస్తుంది.

Optical illusion: ఈ అడవిలో కలిసిపోయిన పక్షిని గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

తెల్లటి కోడి సమీపానికి రాగానే వెంటనే పట్టుకుని, చివరకు రెండు కోళ్లను ఎత్తుకుని అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి చోరీ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘వీడి టెక్నిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

Updated Date - Mar 13 , 2024 | 06:58 PM