Share News

Viral Video: యువతి సముద్రం ఒడ్డున స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఏమైందో చూడండి..

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:40 AM

సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన స్నేహితులతో కలిసి సముద్రం ఒడ్డున సరదాగా గడుపుతుంటుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు సినిమా తరహాలో వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు (Photos) తీస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా..

Viral Video: యువతి సముద్రం ఒడ్డున స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఏమైందో చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో చాలా మంది తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. నెట్టింట వైరల్ కావాలనే ఉద్దేశంతో ఎక్కడ.. ఏం చేస్తున్నామో.. తమకే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. సెల్ఫీల పిచ్చితో కొందరు, విచిత్ర సాహసాలు చేస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సముద్రం ఒడ్డున స్నానం చేస్తూ ఫొటోకు ఫోజులు ఇస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన స్నేహితులతో కలిసి సముద్రం (sea) ఒడ్డున సరదాగా గడుపుతుంటుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు సినిమా తరహాలో వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు (Photos) తీస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. పెద్ద పెద్ద అలలు వచ్చే సమయంలో వాటికి వాటికి సమీపంలో ఫొటోలు దిగాలని అనుకుంటుంది. ఇందుకు తగ్గట్టుగానే సముద్రం ఒడ్డు నుంచి కిందకు దిగి.. అలలు వచ్చే సమయంలో ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ పెద్ద అల రావడంతో ఆమె అదుపు తప్పి నీటిలో పడిపోతుంది.

Viral Video: అరెరే..! ఏదో చేయబోయి.. చివరికి వధువు ముందు పరువు పోగొట్టుకున్నాడుగా..

చూస్తుండగానే కొంచెం దూరం కొట్టుకుపోయిన ఆమె.. ఓ పెద్ద రాయిని పట్టుకుంటుంది. ఊహించని ఈ ఘటనతో ఫొటోలు తీస్తున్న వ్యక్తి దూరంగా పారిపోతాడు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి.. ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో..! ఇంతకీ ఆ యువతి క్షేమంగా బయటపడిందా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ..! శవం పక్కనే కూర్చున్న పాపానికి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Mar 14 , 2024 | 09:48 AM