Share News

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ..! శవం పక్కనే కూర్చున్న పాపానికి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Mar 13 , 2024 | 08:49 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆస్పత్రి వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉంటాడు. కాసేపటికి స్టెచర్‌పై మృతదేహాన్ని తీసుకుని అతడికి సమీపానికి వస్తారు. తర్వాత మృతదేహానికి సంబంధించిన గుర్తులను డాక్టర్ పేపర్‍‌లో నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత..

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ..! శవం పక్కనే కూర్చున్న పాపానికి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సంఘటన ఏదైనా అందులో కాస్త వినూత్నమైన ట్విస్ట్‌లు ఉంటే.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. వీటికి తోడు చాలా మంది ప్రాంక్ వీడియోల పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. శవం పక్కనే కూర్చున్న పాపానికి.. ఓ వ్యక్తికి ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆస్పత్రి (Hospital) వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉంటాడు. కాసేపటికి స్టెచర్‌పై మృతదేహాన్ని (dead body) తీసుకుని అతడికి సమీపానికి వస్తారు. తర్వాత మృతదేహానికి సంబంధించిన గుర్తులను డాక్టర్ పేపర్‍‌లో నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి.. ఇదంతా గమనిస్తూ అలాగే సైలెంట్‌గా మృతదేహాన్ని గమనిస్తుంటాడు. డాక్టర్ వెళ్లిన కాసేపటికి మృతదేహం కాలు కదిలిస్తుంది. దీన్ని చూడగానే కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.

Viral Video: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. కోడిని చూపించి మరో కోడిని ఎలా కొట్టేశారో చూస్తే..

ఇలా మృతదేహం తన కాళ్లను రెండు సార్లు కదిలించగానే.. ‘‘వామ్మో..! ఇదేంట్రా శవం కదులుతోంది’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి, కుర్చీల వెనక్కు వెళ్లిపోతాడు. తర్వాత పడుకున్న శవం కాస్తా.. ప్రాణంతో పైకి లేచి కూర్చుంటుంది. దీన్ని చూడగానే ఆ వ్యక్తి కుర్చీల కింద నుంచి దూరిమరీ బయటికి పారిపోతాడు. ఈ క్రమంలో శవం లాగా నటించిన వ్యక్తి.. అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే అతను ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కౌగిలించుకోవాలని ప్రేయసి ప్రేమతో వస్తే.. ప్రియుడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Mar 13 , 2024 | 08:49 PM