Share News

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

ABN , Publish Date - Mar 21 , 2024 | 11:31 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

ఉత్తరాఖండ్‌లో గర్హ్వాల్, హరిద్వార్, అల్మోరా, నైనిటాల్, తెహ్రీ గర్వాల్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున గర్హ్వాల్ నుంచి అనిల్ బలునీ, హరిద్వార్ నుంచి త్రివేంద్ర సింగ్ రావత్, అల్మోరా నుంచి అజయ్ తమ్టా, నైనిటాల్ నుంచి అజయ్ భట్, తెహ్రీ గర్వాల్ నుంచి మాలా రాజ్య లక్ష్మి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున గర్హ్వాల్ నుండి గణేష్ గోడియాల్, తెహ్రీ నుండి జోత్ సింగ్ గున్సోలా, అల్మోరా నుంచి ప్రదీప్ టామ్టాలను కాంగ్రెస్ ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో.. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈసారి 2 నుంచి 3 నియోజకవర్గా్లో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఆ దిశగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించింది. బీజేపీ మాత్రం ఐదు స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామంటోంది. ఉత్తరాఖండ్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో జూన్4న తేలనుంది.

Lok Sabha Polls 2024: మొదటి దశలో 12 స్థానాలు.. కాంగ్రెస్ బోణి కొడుతుందా..

మహారాష్ట్ర, బెంగాల్‌లో..

మహారాష్ట్రలో 5, పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాలకు మొదటిదశలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. పశ్చిమబెంగాల్‌లో 42 స్థానాలు ఉన్నాయి. రాంటెక్, నాగ్‌పూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రపూర్ స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశాలున్నాయి.

పశ్చిమబెంగాల్‌లో కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురిలో తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బెంగాల్‌లోని ఈ మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తోంది. మొదట ఇండియా కూటమితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా.. సీట్ల పంపకంతో తేడా రావడంతో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ కూడా ఒంటరిగానే వెళ్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 11:34 AM