Share News

Lok Sabha Polls 2024: మొదటి దశలో 12 స్థానాలు.. కాంగ్రెస్ బోణి కొడుతుందా..

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:30 AM

సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 102 స్థానాలు ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్‌లో 12 స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.

Lok Sabha Polls 2024: మొదటి దశలో 12 స్థానాలు.. కాంగ్రెస్ బోణి కొడుతుందా..

సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 102 స్థానాలు ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్‌లో 12 స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న రాజస్థాన్‌లో 2019 ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒక స్థానంలో ఆర్ఎల్‌పీ విజయం సాధించింది. కాంగ్రెస్ బోణి కొట్టలేదు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ 115 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దశలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది. తొలి దశలో ఎన్నికలు జరగనున్న 12 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది.

బోణి కొడుతుందా..

రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గానూ, మొదటి దశలో శ్రీ గంగానగర్, బికనీర్, చురు, జుంజును, సికార్, జైపూర్ సిటీ, జైపూర్ రూరల్, అల్వార్, భరత్‌పూర్, కరౌలి-ధోల్‌పూర్, దౌసా, నాగౌర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 12 స్థానాలకు గానూ 2019 ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్‌ఎల్‌పీ ఒక చోట విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ బోణి కొడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో.. మరోసారి కలమం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రూపొందిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం కనీసం 10 సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితం ఎలా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 10:36 AM