Share News

PM Modi: రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర్ర.. ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:19 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. దేశాన్ని దోచుకునే లైసెన్సు తమకు ఉందని కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆరోపించారు.

PM Modi: రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర్ర.. ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. దేశాన్ని దోచుకునే లైసెన్సు తమకు ఉందని కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆరోపించారు. కానీ బీజేపీ ఆ విధానాన్ని రద్దు చేసిందని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ( PM Modi ) ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ వాసుల 500 ఏళ్ల కల నెరవేరిందన్న ప్రధాని ఈ ప్రాంతం ఆ రాముడి పూర్వీకుల పుణ్యభూమిగా ప్రసిద్ధి గాంచిందని కొనియాడారు.

Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..


"రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ రాజకుటుంబం తిరస్కరించింది. ఈ నిర్ణయం సరికాదని భావించిన కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి తొలగించింది. స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని దోచుకోవడానికి తమకు లైసెన్స్ ఉందని కాంగ్రెస్ భావించింది. కానీ 2014లో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ లూట్ లైసెన్స్‌ను రద్దు చేసింది. గిరిజన సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమాస్తూ ఉండేది. అదే గిరిజన బిడ్డ ఇవాళ దేశానికి రాష్ట్రపతి. ఛత్తీస్‌గఢ్‌కు తొలి గిరిజన ముఖ్యమంత్రిని బీజేపీ ఇచ్చింది. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించింది. గిరిజనుల కోసం బడ్జెట్ ను ఐదు రెట్లు పెంచాం."

- ప్రధాని మోదీ


Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19న జరగనున్నాయి. తొలి దశ ఓటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండనుంది. బస్తర్‌లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్‌కు కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఐదుసార్లు బస్తర్‌లో పర్యటించారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగింది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల కోసం మరోసారి ప్రధాని మోదీ బస్తర్ కు రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 04:19 PM