Share News

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:23 PM

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రైల్వే అధికారులు స్పందించారు. రైల్వే స్టేషన్ దుస్థితికి కారణమైన పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారు. మూడు అంతస్థుల్లో నిర్మితమైన రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పరిస్థితిని వివరిస్తూ ఓ ప్రయాణికుడు ఎక్స్ వేదికగా మూడు వీడియోలు షేర్ చేశాడు. ఈ వీడియోల్లో రైల్వే స్టేషన్ లో నెలకొన్న పరిస్థితులను చూపించారు.


మొదటి వీడియోలో ప్రయాణికులు స్టేషన్ బయటే కునుకు తీస్తుండగా చెత్త డబ్బాలు నిండిపోయాయి. వీధుల్లో చెత్తను శుభ్రం చేయడం లేదని సదరు ప్రయాణికుడు వాపోయాడు. రెండో క్లిప్ లో స్టేషన్‌లో వివిధ ప్రాంతాల్లో పేరుకున్న చెత్తను చూపించాడు. అంతే కాకుండా పాన్, గుట్కా నమిలి ఊసేసిన గుర్తులను క్యాప్చర్ చేశాడు. మూడో ఫుటేజ్ లో రైల్వేస్టేషన్‌ రెండో దశ నిర్మాణ పనులను వీడియో తీశాడు. ఈ వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Anurag Thakur: జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రిగా కొనసాగడం హేయమైన చర్య.. అనురాగ్ ఠాకూర్ ఫైర్..


ఉత్తర రైల్వే లక్నో డివిజన్, నార్త్ రైల్వే డీఆర్ఎం అధికారులు స్టేషన్ పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు రూ.50 వేలు జరిమానా విధించారు. స్టేషన్ లో పారిశుద్ధ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామంటూ స్టేషన్‌ను శుభ్రం చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను రాస్తు్న్నారు. శుభ్రత అనేది తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Trending Video: రొమాంటిక్ సాంగ్.. రంగులతో హల్చల్.. దిల్లీ మెట్రోలో యువతుల రచ్చ..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 09:27 PM