Share News

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే.. వాటిపైనే ప్రధాన దృష్టి..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:46 PM

లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే..  వాటిపైనే ప్రధాన దృష్టి..!

లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది. 'ఘర్ ఘర్ గ్యారంటీ' ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ 5 'న్యాయ్' , 25 'గ్యారంటీ'ల గురించి ప్రజలకు వివరించనున్నారు. దేశంలోని 8 కోట్ల కుటుంబాలకు ఈ గ్యారంటీల ప్రచారం చేరాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేనిఫెస్టోను ఏప్రిల్ 5న దిల్లీలో విడుదల చేసే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఏప్రిల్ 6న జైపుర్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను సిద్ధం చేసింది.

Chandrababu Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కామెంట్స్..

భాగస్వామ్య న్యాయ్, కిసాన్ న్యాయ్, మహిళా న్యాయ్, కార్మిక న్యాయ్, యువ న్యాయ్ వంటి అయిదు న్యాయ్ లు మేనిఫెస్టోలో ఉంటాయని తెలుస్తోంది. యువ న్యాయ్ గ్యారంటీ కింద 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు ఏడాది పాటు శిష్యరికం కార్యక్రమం కింద రూ.లక్ష ఇవ్వనున్నారు. భాగస్వామ్య న్యాయ్ ద్వారా కుల గణన నిర్వహించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తారు. కిసాన్ న్యాయ్ ద్వారా రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హోదా, రుణమాఫీ కమిషన్ ఏర్పాటుతో పాటు జీఎస్టీ రహిత వ్యవసాయం అందిస్తారు.

CM Jagan: సంక్షేమమే పథకాలు అందించాం.. ఆశీర్వదించి రాఖీ కట్టండి.. సీఎం జగన్..


కార్మిక న్యాయ్ కింద కార్మికులకు ఆరోగ్యంపై హక్కు కల్పించడమే కాకుండా రోజుకు కనీస వేతనం రూ.400 ఇస్తారు. పట్టణ ఉపాధి హామీని కల్పించనున్నారు. నారీ న్యాయ్ ద్వారా మహాలక్ష్మి పథకంతో నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇవ్వడమే కాకుండా వారి సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 08:58 PM