Share News

CM Jagan: సంక్షేమ పథకాలు అందించాం.. ఆశీర్వదించి రాఖీ కట్టండి.. సీఎం జగన్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:00 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

CM Jagan: సంక్షేమ పథకాలు అందించాం.. ఆశీర్వదించి రాఖీ కట్టండి.. సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా ఎమ్మిగనూరు మేము సిద్దం సభకు సీఎం జగన్ హాజరయ్యారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందని 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు జరిగాయని చెప్పారు. ఇలాంటి పాలనను గతంలో మీరు చూశారా అని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తును గత పాలకులు పట్టించుకోలేదని, పథకాలు అందించిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరారు.

Rahul Gandhi: కాంగ్రెస్ వస్తే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.. రాహుల్ సంచలన ప్రకటన

దిశ యాప్ ద్వారా 39 వేల అక్క చెల్లెలమ్మలకు భద్రత కల్పించాం. పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ కు టికెట్ ఇవ్వలేకపోయాను. రెండేళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటిస్తున్నా.

- వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Chandrababu Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కామెంట్స్..


కాగా.. సీఎం జగన్ పర్యటనలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్ధం సభ కోసం భారీగా జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో అరకొర బస్సులతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. వచ్చిన బస్పుల్లో సామర్ధ్యానికి మించి 80 మందికిపైగా ఎక్కుతుండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. గంటలకొద్దీ బస్టాండ్‌లోనే ప్రయాణీకులు పడిగాపులు కాశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 08:01 PM