Share News

Congress: కుల గణన ఇందిర, రాజీవ్ గాంధీల వారసత్వానికి అవమానం.. కాంగ్రెస్

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:28 PM

కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు.

Congress: కుల గణన ఇందిర, రాజీవ్ గాంధీల వారసత్వానికి అవమానం.. కాంగ్రెస్

కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు. కుల ప్రాతిపదికన జనాభా గణనను డిమాండ్ చేయడం అంటే మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను అవమానించినట్లేనని అన్నారు. ఇది వారి వారసత్వానికి విరుద్ధమని చెప్పారు. కులం ఆధారంగా జనాభాను గణించడం ప్రజాస్వామ్యానికి హానికరమని లేఖలో పేర్కొన్నారు. తద్వారా రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

శర్మ తాను రాసిన లేఖలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1980లో చేసిన వాఖ్యలను జత చేశారు. "భారత్ లో కులాన్ని నిర్వచిస్తే అది మనకే ఇబ్బంది. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కులతత్వం అంశంగా పెడితే ఇబ్బందులు తప్పవు. ఫలితంగా ఈ దేశం విడిపోయే అవకాశం ఉంది. దాన్ని కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు." అని ఇందిరా గాంధీ చెప్పినట్లుగా శర్మ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కుల గణన చేయడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదని స్పష్టం చేశారు.

Hyderabad: ఆ అధికారి చర్యతో ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం.. వెలుగులోకి సంచలన విషయాలు..


వాస్తవానికి కుల గణనను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని డిమాండ్ చేస్తు్న్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Trending: తాళి కట్టే సమయంలో ఫోన్ రింగ్.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. కట్ చేస్తే..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 04:28 PM