Share News

AP Election: సీఎం జగన్ కొత్త డ్రామాలు.. ప్రజా గళం సభలో చంద్రబాబు

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:38 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త నాటకానికి తెరతీశాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాయి తగిలిందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని.. సీఎం జగన్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. పాయకరావుపేటలో జరిగిన ప్రజా గళం సభలో చంద్రబాబు మాట్లాడారు.

AP Election:  సీఎం జగన్ కొత్త డ్రామాలు.. ప్రజా గళం సభలో చంద్రబాబు
TDP Chief Chandrababu Naidu Fires On CM Jagan

అనకాపల్లి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కొత్త నాటకానికి తెరతీశాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. రాయి తగిలిందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని.. సీఎం జగన్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. పాయకరావుపేటలో జరిగిన ప్రజా గళం సభలో చంద్రబాబు మాట్లాడారు. సభ వేదికపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఉన్నారు.

AP Election 2024: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమిదే..!


‘అంబేద్కర్ జయంతి రోజున మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేసేవారు మంచివారు కాకుంటే ప్రయోజనం లేదు. జగన్ అరాచక శక్తి.. తిరిగి లేవకుండా కాంక్రీట్ వేయాలి. రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన అరాచకాలను చూశారు. నాకు పవన్ తోడుగా ఉన్నారు. మా ఇద్దరికి ప్రధాని మోదీ అండగా ఉన్నారు. ఏపీని నంబర్ వన్ చేస్తాం. ఉత్తరాంధ్రను సీఎం జగన్ పట్టించుకోలేదు. సీఎం జగన్ కోసం విలాస భవంతి కావాలి.. పేదలు మాత్రం ఇరుకైన ఇంట్లో ఉండలా..? అని’ చంద్రబాబు మండిపడ్డారు.

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?


‘రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను సీఎం జగన్ తరిమివేశాడు. విశాఖను గంజాయికి క్యాపిటల్ చేశాడు. భూములను గద్దల్లా దోచేశారు. కరెంట్ చార్జీలు పెంచారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో స్కాంలు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక అందజేస్తాం. జగన్ పది ఇచ్చి, వంద కొట్టేస్తాడు. నేను అప్పు తీసుకొని రాను, సంపద సృష్టిస్తా.. ఆ సంపదను మీకే పంచుతా. సూపర్ సిక్స్ పటిష్టంగా అమలు చేస్తాం అని’ చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Election: రాయి ఫోర్స్‌గా వచ్చింది.. పథకం ప్రకారమే దాడి, ఈసీకి వైసీపీ నేతల కంప్లైంట్

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 07:38 PM