Share News

AP Election 2024: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమిదే..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:32 PM

సీఎం జగన్‌ (CM Jagan) పై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు నిక్ష్పక్షిక విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ఈసీకి లేఖ రాశారు. ఈ దాడి ఘటనకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

AP Election 2024: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమిదే..!

ఢిల్లీ: సీఎం జగన్‌ (CM Jagan) పై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు నిక్ష్పక్షిక విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ఈసీకి లేఖ రాశారు. ఈ దాడి ఘటనకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

సీబీఐ లేదా ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని కోరారు. ‘‘సీఎం జగన్ నిన్న(శనివారం) విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఈ సమయంలో ఆయనకు తగిన భద్రత కల్పించడంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీ పూర్తిగా విఫలం అయ్యారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పోలీసులు తమ విశ్వాసనీయత, నిష్పాక్షికత కోల్పోయారు. గతంలో టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడం ప్రజాస్వామ్య హక్కని అప్పటి డీజీపీ సమర్థించి దోషులను వదిలేశారు.


మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై 2021లో దాడి జరిగినా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోకుండా.. పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహారించారు. చిత్తూరు జిల్లా అంగళ్లు, కుప్పంలో రాళ్లదాడి జరిగినప్పుడు పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహించారు. ప్రకాశం జిల్లాలోని యర్రగొండ పాలెంలో వైసీపీ మంత్రి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డారు. గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ఎన్డీఏ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యక్రమానికి తగిన భద్రత ఏర్పాట్లు చేయడంలో కూడా రాష్ట్ర పోలీసు శాఖ ఘోరంగా విఫలమైంది.


ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జగన్‌పై రాయి దాడి ఘటనకు ప్రాథమిక విచారణ చేయక ముందే టీడీపీ, చంద్రబాబు బాధ్యులంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా దుష్ప్రచారం చేయడం దారుణం. ఇది వైసీపీ మోసపూరిత చర్య. వాస్తవానికి, అన్ని ముఖ్యమైన పదవుల్లో తనకు నచ్చిన వ్యక్తులను ఉంచడం వల్ల మొత్తం పోలీసు పరిపాలన సీఎం జగన్ కనుసన్నల్లోనే ఉంది. చట్టాన్ని అమలు చేసే సంస్థలను వెన్నెముక లేని జీవులుగా కుదించి వైసీపీ కార్యకర్తల్లా మార్చారు. ఆయనపై జరిగిన ఈ దాడిని ప్రతిపక్ష నేతలపై నెడుతున్నారు.


AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?

వైసీపీ మంత్రులు కొందరు టీడీపీ నేతలపై అంభాడాలు వేస్తున్నారు. అలాగే ప్రముఖ ప్రకటనల ద్వారా పోలీసుల దర్యాప్తులో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ.. గత ట్రాక్ రికార్డ్ ప్రకారం, పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ కోసం టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టేలా జగన్ ప్రభుత్వం కుట్రకు పాల్పడే అవకాశం ఉంది.


లా అండ్ ఆర్డర్ విధుల్లో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. పోలీసు అధికారులు వారి వైఫల్యాలపై దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండకపోవచ్చు. వాస్తవాలను బయటకు తీసుకురాకపోవచ్చు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఈసీఐపై ఉంటుంది కాబట్టి... వెంటనే జోక్యం చేసుకోవాలి.


రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను నియంత్రించాలని, ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగేలా తగిన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. సీఎంకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు ప్రస్తుత డీజీపీ, డీజీపీ ఇంటెలిజెన్స్, విజయవాడ పోలీసు కమిషనర్‌ల బృందం బాధ్యత వహించాలి.


Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

సీఎం జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించి, ప్రధానమంత్రి మోదీ కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు చేయలేకపోతే, మే 13వ తేదీన జరిగే పోలింగ్ రోజు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలంటే డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ ఇంటెలిజెన్స్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటాలను వెంటనే బదిలీ చేయాలి.


సీఎం భద్రతా వైఫల్యంపై ఈసీఐ విచారణకు ఆదేశించాలి. అదే సందర్భంలో గతంలో ఇచ్చిన విజ్ఞాపనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దాడిలో అసలు దోషులను గుర్తించి ప్రాసిక్యూట్ చేయడానికి, సీబీఐ లేదా ఎన్‌ఐఏ వంటి ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేయాలి’’ అని ఈసీకి కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 06:50 PM